సూపర్ కృష్ణ భార్య, సీనియర్ హీరోయిన్, దర్శక నిర్మాత విజయనిర్మల ఈ రోజు(గురువారం)తెల్లవారు ఝామున గుండెపోటుతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్ను మూసారు. అత్యధిక చిత్రాల దర్శకురాలిగా గిన్నిస్ బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించిన విజయ నిర్మల గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి న చెన్నై లో విజయ నిర్మల జన్మించారు. పలు సినిమాల్లో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న విజయ నిర్మల దర్శకురాలిగా కూడా టాప్ లెవల్లో క్రేజ్ ఉన్న దర్శకురాలు. రంగుల రాట్నం చిత్రంతో హీరోయిన్ గా మారిన విజయ నిర్మల.... దాదాపుగా 50 సినిమాల్లో కృష్ణ తో కలిసి హీరోయిన్ గా నటించారు. కృష్ణ తో కలిసి సాక్షి సినిమాతో తొలిసారి ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విజయ నిర్మల సినిమాలను తెరకెక్కించారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన తోలి తెలుగు చిత్రం మీనా. విజయనిర్మల 2008 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు.
విజయనిర్మల మృతికి పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. విజయనిర్మల అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయని కుటుంబ తెలియజేసారు.