Advertisement
Google Ads BL

‘కరుణామయుడు’గా లోహిత్ కుమార్


‘కరుణామయుడు’గా మెప్పించిన లోహిత్ కుమార్ 

Advertisement
CJ Advs

మిమిక్రి ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, ఈవెంట్స్ ఆర్గనైజర్ గా, బుల్లితెర హీరోగా, వెండితెరపై పలు రకాల పాత్రలతో మెప్పించే నటుడిగా, నిర్మాతగా బహుముఖాలుగా తన ప్రతిభను చాటుకునే లోహిత్ కుమార్ తాజాగా ‘కరుణామయుడు’గా రక్తి కట్టించడమే కాదు, కంటతడి సైతం పెట్టించారు. ఇటీవల రవీంద్రభారతిలో ప్రదర్శితమైన ‘కరుణామయుడు’ నాటకంలో లోహిత్ కుమార్ టైటిల్ పాత్ర పోషించారు. 

‘‘ఒక నటుడిగా నేను పలు వైవిధ్యభరిత పాత్రలు చేశాను. నేను పోషించిన ప్రతి పాత్రకు ప్రశంసలు పొందాను. కానీ.. ‘కరుణామయుడు’లో నేను చేసిన యేసు ప్రభువు పాత్రకు వస్తున్న స్పందన మాత్రం అపూర్వం.  విజయ్ చందర్ గారి తరువాత అచ్చు గుద్దినట్లుగా యేసుప్రభువులానే ఉన్నారు, ఇకపై యేసుప్రభువు పాత్ర కోసం ఎవరినీ వెతుక్కోనవసరం లేదు..  అని అందరూ అంటుంటే కలుగుతున్న సంతోషం అంతా ఇంతా కాదు’’ అంటున్నారు లోహిత్ కుమార్.  

లోహిత్ కుమార్ నిర్మించి, నటించిన వినోదభరిత సందేశాత్మక చిత్రం ‘అక్షరం’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది!!

Lohith kumar in karunamayudu Role:

Lohith Perfectly Sets to karunamayudu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs