Advertisement
Google Ads BL

ఓ బేబీ ఆ టైపు సినిమా కాదంటున్న సామ్!


మరికొన్ని రోజుల్లో సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రం రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ప్రమోషన్స్ చేస్తున్న సామ్ ఓ ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు. ఓ బేబీ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఓ స్మయిల్ ఉంటుంది. దాదాపు 90 శాతం ఈసినిమాలో నేను నవ్వుతూనే ఉంటా. కాకపోతే క్లైమాక్స్ లో కొంత ఎమోషనల్ కి లోనవుతారు. అది తప్ప సినిమా మొత్తం కామెడీతోనే సాగుతుంది. ఇది  ఫ్యామిలీ మొత్తానికి సెలబ్రేషన్. ఎక్కువ మంది కామెడీ కే కనెక్ట్ అవ్వుతారు అని భావించాం. కానీ చాలామంది క్లైమాక్స్ లో ఎమోషన్ కు కనెక్ట్ అయ్యారు. 

Advertisement
CJ Advs

ఇప్పటి వరకు ఈమూవీని దాదాపు 200 మంది చూసారు. చూసినవాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు, తమ స్నేహితులకు ఓ బేబీ సినిమాను చూపించామని, వాళ్లంతా ఇందులో ఎమోషన్ కు బాగా కనెక్ట్ అయిపోయారని చెప్పుకొచ్చింది సమంత. ఇప్పటి వరకు ఈమూవీని కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రమోట్ చేసాం. కానీ ఇప్పటి నుండి ఇందులో ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పడం స్టార్ట్ చేశామని చెప్పింది సామ్. 

ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి నటించానంటున్న సామ్... రాజేంద్ర ప్రసాద్ సహకారం, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోతే సినిమా లేదంటోంది. అలానే దీనికి సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. సీక్వెల్ లో నటించడం నా వల్ల కాదని డైరెక్టర్ నందిని రెడ్డికి చెప్పేసాను. ఒకవేళ సీక్వెల్ చేయాలనుకుంటే వేరే వాళ్ళను చూసుకోమని డైరెక్ట్ గా చెప్పేసానని అంటుంది సామ్.

Samantha on Oh Baby Movie:

Oh Baby Not a Comedy Film.. Says Samantha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs