Advertisement
Google Ads BL

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వక ముందే నాగ్‌పై ట్రోలింగ్!


తెలుగు బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున దాదాపు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటన ఒక్కటే మిగిలుంది. అయితే బిగ్‌బాస్ సీజన్-03 అన్నప్పట్నుంచి నాగ్ దానికి హోస్ట్ అని వార్తలు వచ్చేశాయి. అయితే ఆయన పేరు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఇంకా హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. అప్పుడే నెట్టింట్లో నాగ్‌పై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ ట్రోలింగ్‌కు కారణం.. నాగ్-నాని కలిసి నటించిన ‘దేవదాస్’ మూవీ ప్రమోషన్‌లో బిగ్‌బాస్ ప్రస్తావన రాగా.. ఆ షో గురించి తన దగ్గర మాట్లాడొద్దు బాబాయ్.. ఆ కాన్సెప్ట్, ఆ దాగుడు మూతలు ఇవన్నీ తనకు నచ్చవని తెగేసి చెప్పేశారు. అంటే అప్పట్లో తనకు హోస్ట్‌గా వెళ్లడం ఇష్టం లేదనే పరోక్షంగా హింటిచ్చారన్న మాట.

అయితే ఇప్పుడు మాత్రం ఆ మాటలన్నీ మరిచిపోయిన నాగ్.. ‘మా’ యాజమాన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఇదెలా..? ఓహ్.. అంతా డబ్బు మాయ.. డబ్బు ఏ పనైనా చేస్తుంది లెండి.. అంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. మరికొందరు అప్పుడు ఏం నచ్చలేదు.. ఇప్పుడేం తమరికి నచ్చిందో ఓసారి చెప్పుకోండి సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై నాగ్ ఎలా రియాక్ట్ అవుతారో మరి. మొన్న కాళేశ్వరం ప్రారంభం రోజున మాజీ మంత్రి హరీష్ పేరు మరవడంతో.. నేడు బిగ్‌బాగ్ హోస్ట్ వ్యవహారంలో ఇలా ఈ మధ్య రెండు సార్లు నాగ్ ట్రోలింగ్‌‌కు గురయ్యారు!

Before Bigg Boss Entry.. Trolling on Nagarjuna:

Nagarjuna Trolled by his Speaks at Devadas Time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs