Advertisement
Google Ads BL

అవన్నీ పుకార్లే.. నమ్మొద్దు: కృష్ణవంశీ


గతంలో కృష్ణవంశీ సినిమాలంటే పడిచచ్చిపోయే ప్రేక్షకులు ఉండేవారు. ఆయన సినిమాలకు స్పెషల్ ఆడియన్స్ ఉండేవారు. కానీ గత కొంతకాలంగా కృష్ణవంశీ క్రియేటివిటీ గాల్లో కలిసిపోయింది. ఆయన తాజాగా తెరకెక్కించిన సినిమాలు చూస్తే మన కృష్ణవంశీయేనా ఇలాంటి సినిమాలు తీసిందని అనిపించకమానదు. అయితే గత కొంతకాలంగా కృష్ణవంశీ కొత్త ప్రాజెక్ట్ మొదలపెట్టకుండా ఖాళీగా వుండిపోయాడు. కృష్ణవంశీ కథ ప్రిపేర్ చేసుకుని హీరోలు చుట్టూ తిరుగుతున్నా హీరోలెవరు కృష్ణవంశీకి అవకాశాలిచ్చే ఆలోచన  చెయ్యడం లేదు. అయితే ఉన్నట్టుండి... కృష్ణవంశీ దర్శకత్వంలో నిర్మాత బండ్ల గణేష్ రుద్రాక్ష అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లుగా ఆయా వార్త సోషల్, వెబ్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Advertisement
CJ Advs

నిజంగానే కృష్ణవంశీ కొత్త ప్రాజెక్ట్ రుద్రాక్ష పట్టాలెక్కబోతుందంటూ.... ఫిలింనగర్ లోను, సోషల్ మీడియాలోను ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఆ రుద్రాక్ష సినిమా వార్తపై తాజాగా దర్శకుడు కృష్ణవంశీ స్పందించాడు. రుద్రాక్ష టైటిల్ తో నేను ఒక సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఒకవేళ తాను ఏ సినిమా మొదలెట్టినా.... అధికారికంగా మీడియాకి తెలిపిన తర్వాతే మొదలెడతానని, అప్పటివరకు తాను సినిమాలు చేస్తున్నట్లుగా వచ్చే పుకార్లను నమ్మొద్దని.. కృష్ణవంశీ చెబుతున్నాడు.

Krishnavamsi Reacted on Rudraksha Rumours:

I Am Not Doing Any Film.. Says krishnavamsi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs