ఆర్య, కేథరీన్ జంటగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజేంద్రుడు’. ఉదయ్ హర్ష ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. భారతీ, వరప్రసాద్ వడ్డెల సమర్పకులు. ప్రశాంత్ గౌడ్, సంజు ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేశారు. సైలెంట్ గా గతవారం విడుదలై మంచి వసూళ్లను సాధిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.
ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. సినిమాను నైజాంలో విడుదల చేశాం. ఇదొక సైలెంట్ హిట్. నిర్మాత నమ్మకమే ఈ చిత్ర ప్రధాన విజయం. రోజురోజుకు థియేటర్స్ పెంచుకుంటూ మంచి విజయాన్ని అందుకుంది. 300 థియేటర్స్ లో అద్భుతంగా ఆడుతోంది. మంచి కాన్సెప్ట్ తో విజువల్ వండర్ గా గజేంద్రుడు రూపొందింది. వచ్చే వారం మరిన్ని థియేటర్స్ ఈ సినిమాకు ఇస్తామన్నారు.
ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ... ఆర్య గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ధన్యవాదాలు. హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధ్యాంక్స్ తెలిపారు.
ఆర్య మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ సినిమా పాటలకోసం హైదరాబాద్ వచ్చాం. అడవిలో చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమా మేకింగ్ చేశాం. మా హార్డ్ వర్క్ కు తగ్గ ఫలితం వచ్చింది. తెలుగు, తమిళ ప్రేక్షకులు అపూర్వమైన విజయాన్ని అందించారన్నారు.