Advertisement
Google Ads BL

‘ఏజెంట్’.. నాకు బాగా నచ్చాడు: విజయ్


‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా నాకు చాలా బాగా న‌చ్చింది :  విజ‌య్ దేవ‌ర‌కొండ   

Advertisement
CJ Advs

స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింపబ‌డుతోంది. ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ కోవలోనే క్రేజీ హీరో విజయ దేవరకొండతో పాటు హీరో అడవిశేషు, దర్శకుడు తరుణ్ భాస్కర్, ఆనంద్ దేవరకొండ తదితరులు సోమవారం సాయంత్రం ఎ.ఎం.బి.సినిమాస్ లో ఈ సినిమాను చూసి తమ స్పందన  తెలియచేయడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ...

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఆరేళ్లకు పైగా ఈ చిత్ర హీరో నవీన్ నాకు బాగా తెలుసు. థియేటర్స్‌లో వర్క్ షాప్ చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తరువాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో కలసి పనిచేశాం. మళ్లీ ఇప్పుడు ఇలా క‌లిశాం. నవీన్ హీరో హీరోగా చేసిన‌ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా నాకు బాగా నచ్చింది. టెక్నీకల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. స్వరూప్ డైరెక్షన్ అదిరిపోయింది. మ్యూజిక్ అండ్ ఆర్‌.ఆర్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకు నవీన్ నటన పెద్ద ఎస్సెట్. నా నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఇదే స్పందన రావడం చూసి సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ ఇలా సక్సెస్ అయ్యాడని గర్వంగా కూడా ఉంది. ఇండస్ట్రీలో నవీన్‌లాంటోడు మ‌రొక‌డు లేడు అని చెప్పగలను. ఇంకో కొత్త సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నవీన్. మరిన్ని మంచి  సినిమాలు చేస్తూ   విజయం సాధించాలని ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 

అడవిశేషు మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే సినిమా చూశాం. చాలా బాగా నచ్చింది నాకు. మొదటి నుంచి థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా అదే తరహా కనుక ఇంకా బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో ఆర్.ఆర్ కు అయితే నేను హమ్ చేయడం మొదలు పెట్టా.. అంతగా కనెక్ట్ అయ్యాను. మొదట ఎగ్జైట్ మెంట్‌తో సినిమా చూడడానికి వచ్చా.. నా ఎక్స్పెక్టేషన్స్‌కు సినిమా రీచ్ అయ్యింది. సినిమాలో బిగ్గెస్ట్ హైలెట్ నవీన్. ఓ మంచి సినిమాను ప్రెజెంట్ చేశారు. ఇలాంటి సినిమాకు తప్పకుండా మరింత సపోర్ట్  అందించాలని కోరుతున్నాను’’ అన్నారు. 

దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘థ్రిల్లర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ సినిమాలో నెల్లూరు యాస చాలా స్వీట్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చాలా నచ్చింది. చూడని వారుంటే తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా’’ అన్నారు.   

దర్శకుడు స్వరూప్  మాట్లాడుతూ.. ‘‘మేము మొదట భయపడ్డాం. కానీ మా సినిమాను చూసిన వారందరూ బాగుందని చెప్పడమే కాకుండా మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం అని ట్యాగ్ లైన్ కూడా ఇస్తుండటంతో హ్యాపీగా ఉన్నాం. చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ల వయసు పెద్ద వారు కూడా నేను ఎక్కడ కనపడితే అక్కడ మంచి సినిమా తీశారంటూ మెచ్చుకుంటున్నారు. సూపర్ హిట్ మూవీ ఇచ్చిన ఆడియన్స్‌కు నా ధన్యవాదాలు’’ అని చెప్పారు.

నిర్మాత రాహుల్ మాట్లాడుతూ.. ‘‘డిటెక్టివ్ జోన‌ర్ సినిమాలు ఈ మధ్య రావడం లేదు వచ్చినా ప్రేక్షకులు చూడటం లేదు అలాంటి తరుణంలో మా సినిమాను చూస్తారా? అని మొదట భయపడ్డాను కానీ మా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ విడుదల తరువాత ఆ భయం, ఆలోచన రెండూ పోయాయి. హానెస్ట్ ఫిల్మ్ తీస్తే ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. మొదటి నుంచీ మా సినిమాపై మాకు ఉన్న నమ్మకమే నిజమయ్యింది’’ అని చెప్పారు. 

హీరో నవీన్ మాట్లాడుతూ.. ‘‘సినిమా రిలీజ్ అయిన మొదట్లో భయపడ్డాం. కానీ మొదటి షో రిజల్ట్ తరువాత ఆ భయం పోయి సంతోషపడ్డాం. రెండేళ్లుగా ఉద్యోగం మానేసి మరీ ఈ ప్రాజెక్ట్ కోసం మేమందరం కష్టపడ్డాం. ఇప్పుడీ హ్యూజ్ రెస్పాన్స్ చూస్తుంటే మా కష్టం మరచిపోయాం. హైదరాబాద్ లో 60 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తోంది. ఈ మా సినిమాను చూసి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, అడవి శేషులకు నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’’ అన్నారు. 

ఆనంద్ దేవరకొండ, నటుడు సుహాన్, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్, డిఓపి సన్నీ కృపాటి, ఎడిటర్ అమిత్ త్రిపాఠి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Vijay Deverakonda Response on Agent Srinivasa Atreya:

Agent Sai Srinivasa Atreya Special Show for Vijay Deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs