Advertisement
Google Ads BL

‘‘సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’’ చిత్రం ప్రారంభం


మన దేశంలో ‘‘సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’’కు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. దాని గురించి ప్రజలందరికీ తెలియాలంటే ప్రభుత్వం కూడా కలిసిరావాలి. దీన్ని బేస్‌ చేసుకుని చిత్రం రూపొందుతోంది. ‘శ్రీశ్రీ’ పేరుతో సూపర్‌స్టార్‌ కృష్ణతో చిత్రాన్ని నిర్మించిన సాయి దీప్‌ చాట్ల ఈసారి జి.జాన్‌, సందీప్‌తో కలిసి కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నారు.

Advertisement
CJ Advs

మలి చిత్రం యూత్‌ ఫుల్‌ ఎంటర్ టైనర్ అయినా ‘‘నాటకం’’ చిత్రంతో ఎంతో మంది నూతన నటీనటుల్ని, దర్శకుడిని పరిచయం చేసిన ఆయన మరో అడుగు ముందుకు వేసి తన తృతీయ చిత్రం ‘‘సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’’ రూపొందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ముహూర్తం షాట్‌ని వెంకటేశ్వర స్వామి ఆలయం, గోరంట్ల, గుంటూరులో ఇటీవల ప్రారంభించారు. నూతన దర్శకుడు అయిన సందీప్‌ జక్కం సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని తెలిపారు.

అంగనారాయ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆమె పాత్ర చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని నిర్మాత తెలియజేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. చిత్ర కథాంశం గురించి చెప్పాలంటే.. మన దేశంలో పురాతన కాలం నుంచి ఓ సాంప్రదాయం వుంది. వివాహ వ్యవస్థ బలీయమైంది. ఇరువురు వ్యక్తుల్ని, కుటుంబాల్ని కలిపి ఒక్కటిగా చేస్తూ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే ఒరవడి మన సంస్కృతి. కానీ రానురాను దానికి బీటు వారిపోతున్నాయి. పాశ్చాత్య ధోరణులు విపరీతంగా పెరిగిపోయి... కుటుంబ వ్యవస్థను శాసిస్తున్నాయి. దానితో యువతీ యువకులు సహజీవనం పేరుతో జీవనాన్ని సాగిస్తూ ఇష్టం లేనప్పుడు ఈజీగా విడిపోతున్నారు. దాంతో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, స్వార్థం, ఈర్ష ద్వేషాలు పెరిగిపోతున్నాయి. 

మరోవైపు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైపు ఆకర్షితులవుతున్నారు. మన వివాహవ్యవస్థ గురించి అక్కడ గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో విదేశీ యువతులు ఇక్కడి వారిని సంప్రదాయంగా పెండ్లిచేసుకున్న సంఘటనలు చాలానే వున్నాయి. అందుకే మన సంప్రదాయాలు మరుగునపడిపోకుండా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఒకటి ఏర్పాటైంది. దానికి ప్రభుత్వంలోని చాలా మంది సమర్థిస్తున్నారు. దీనిపై చిత్రం చేయాలనే తలంపుతో సాయిదీప్‌  ప్రయత్నం చేస్తున్నారు. 

కాగా, ఇల్లీగల్‌ అఫైర్స్‌ మీద... జనరల్‌ అవేర్నెస్‌ కోసం... సుప్రీమ్‌ కోర్ట్‌ 2018 సెప్టెంబర్‌ లో... స్ట్రెయిక్‌ డౌన్‌ చేసిన సెక్షన్‌ 497నే, సినిమా పేరుగా ఉంచుకొని ఈ సినిమా నిర్మిస్తున్నామని నిర్మాత తెలియజేశారు. ఒక ఎస్‌.పి. అల్లుడు డిఫ్యూటీ సూపరింటెండెట్‌ ఆఫ్‌ పోలీసును హౌస్‌ అరెస్ట్‌ చేసినప్పుడు జరిగే పరిస్థితుల్ని కథగా రూపొందించామని ఆయన తెలిపారు. ఇందులో డిఫ్యూటీ సూపరింటెండెట్‌ ఆఫ్‌ పోలీసుగా అంగనా రాయ్‌ నటిస్తున్నారు. ఎస్‌.పి. అల్లుడిగా కేతన్‌ సాయి నటిస్తున్నారు. ఆయన సరసన జియా డార్ల నటిస్తున్నారు. మెయిన్‌ సపోర్ట్‌ పాత్రలో మణికాంత్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాషల్లో అంగనారాయ్‌ నటిస్తోంది. మిగిలిన కొన్ని పాత్రలే మారతాయి. జూలై మొదటి వారం నుంచి సెట్‌పైకి వెళ్ళనుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత వెల్లడించారు. ఇదిలా వుండగా, ఈ చిత్రానికి సంబంధించిన సెక్షన్‌ కోసం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన శాసనసభ్యులు, మంత్రులు కూడా సపోర్ట్‌గా నిలుస్తున్నారని నిర్మాత పేర్కొన్నారు.

ఈ చిత్రంలో అంగనా రాయ్‌, జానీ రావు, సాయి కేతన్‌, జియా డార్ల, అదిత్యశేఖర్‌ తదితరులు నటిస్తున్నారు. 

సాంకేతిక నిపుణులు: చరణ్‌ అక్కా, సంగీతం: ఎస్‌కె. బాజి, ఎడిటింగ్‌: మణికాంత్‌ త్లెగూటి.

Section 497 Indian Penal Code Movie Launched:

Section 497 Indian Penal Code Movie launch Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs