Advertisement
Google Ads BL

మహాలక్ష్మి మూవీ మేకర్స్ 2వ చిత్రం స్టార్టయింది


మహాలక్ష్మి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.2 సినిమా ప్రారంభం

Advertisement
CJ Advs

రంజీత్, సౌమ్య మీనన్ లను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పత్తికొండ కుమారస్వామి నిర్మాణ సారధ్యంలో యం. రవికుమార్ నిర్మిస్తున్న చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంతో రామకృష్ణ మైలా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ను దర్శకుడు విజయ్ కుమార్ కొండా మూవీ డైరెక్టర్ రామకృష్ణకు అందివ్వగా, కెమారా స్విచ్ఛాన్ నిర్మాత భరత్ చేసారు. సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్ ఇచ్చి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే కథ. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో చిత్రం రూపొందుతుందని టీం అంటుంది. 

ఈ సందర్భంగా హీరో  రంజీత్ మాట్లాడుతూ:

‘ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. లవ్ స్టోరీ కూడా కొత్తగా ట్రావెల్ అవుతుంది. ఈ కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ కి వెళుతున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా రూపొందుతుందనే నమ్మకం నాకు ఉంది.’ అన్నారు.

హీరోయిన్ సౌమ్య మీనన్ మాట్లాడుతూ:

‘తెలుగు ఇండస్ట్రీలో పనిచేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఒకరకంగా ఇది నా డ్రీమ్. ఈ కథ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. రామకృష్ణ గారు ఈ కథను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ట్రీట్ మెంట్ ఇచ్చారు. షూటింగ్ కి ఎప్పుడు వెళతామా అనే ఉత్సాహంతో ఉన్నాను. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగు పరిశ్రమలో ఒకరిగా నన్ను ఆహ్వానించిన టీం కి థ్యాంక్స్’ అన్నారు.

నిర్మాత యం. రవికుమార్ మాట్లాడుతూ:

‘టాలెంట్ ని ప్రోత్సహించడానికి మా నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుంది. కొత్త వారయినా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకంతో సినిమా మొదలు పెట్టాము. మరో పది సినిమాలు మా సంస్థనుండి ప్రారంభం అవుతాయి. పత్తికొండ కుమార్ స్వామి గారు మాకు వెన్నుదన్నుగా నిలవడం మా అదృష్ణం.  రామకృష్ణ చెప్పిన కథలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో ఈసినిమా రూపొందుతుంది’ అన్నారు.

దర్శకుడు రామకృష్ణ మైలా  మాట్లాడుతూ:

‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. రంజీత్, సౌమ్య మీనన్ పాత్రలు బాగా వచ్చాయి. యూత్ కి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఈకథను డ్రైవ్ చేస్తాయి. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూట్ కి వెళతాం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేసాం. తప్పకుండా అందరినీ మెప్పేంచే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాననే నమ్మకం ఉంది’ అన్నారు.

రంజీత్, సౌమ్య మీనన్ జంటగా నటించే ఈ చిత్రానికి  రావు రమేష్, వి.కె నరేష్ ప్రధాన పాత్రలలో కనిపిస్తారు.

సాంకేతక వర్గం:

ఎగ్జిక్యూటివ్ మేనేజర్: నాగే్శ్వరరావు 

పిఆర్ వో: జియస్ కె మీడియా

ఫైట్స్: నందు మాస్టర్

స్టిల్స్ : క్రిష్ణ

పబ్లిసిగీ డిజైనర్:  లెనిన్ బాబు

మేకప్ : శివ

క్యాస్టూమ్స్ : సుబ్బయ్య

ఎడిటర్: ప్రవీణ్ పూడి

కో డైరెక్టర్: సీతారామరాజు

రైటర్: నరేష్ పరుచూరి

ఆర్ట్ డైరెక్టర్: నారాయణ

మ్యూజిక్: అనూప్ రూబెన్స్

కెమెరామెన్: బాలిరెడ్డి

సమర్పణ : పత్తికొండ కుమార స్వామి  

నిర్మాత : యం. రవికుమార్

దర్శకుడు: రామకృష్ణ మైలా

Mahalakshmi Movie Makers Production No 2 Movie Launched:

Mahalakshmi Movie Makers Production No 2 Movie Opening details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs