ఇతర భాషల్లో ఏమో కానీ హిందీలో ‘బిగ్‌బాస్’ ఎంత క్లిక్ అయిందంటే ఏకంగా 13 సీజన్స్ వరకు వచ్చింది. మొదటి సీజన్ నుండి దీనికి సల్మాన్ ఖానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు 13 సీజన్ కూడా ఆయనే. అయితే ఈ సీజన్ కోసం సల్మాన్ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.
అక్షరాలా సల్మాన్ ఈ సీజన్ కోసం రూ.403 కోట్లు కావాలని అడిగారట. ఈ సీజన్ మొత్తం 26 ఎపిసోడ్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ కి రూ. 31 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. దాంతో మేకర్స్ షాక్ అయ్యి చేసేది ఏమి లేక సల్మాన్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారట. సల్మాన్ ని కాదని ఆ ప్లేస్ లో మరొకర్ని ఊహించుకోలేం.
ఒకవేళ ఇది నిజం అయితే ఓ టీవీ షో కోసం అత్యధిక మొత్తంలో నగదు తీసుకున్న ఏకైక భారతీయ సెలబ్రిటీ సల్మాన్ ఖానే అవుతారు. హిందీ బిగ్ బాస్ ఇంతలా క్లిక్ అవ్వడానికి కారణం ప్రతి ఎపిసోడ్ చాలా కురియాసిటీతో జరుగుతుంది కాబట్టి.