Advertisement
Google Ads BL

హిట్టు మీద హిట్టు కొట్టాడు.. నెక్స్ట్ ఏంటో?


సొంత ఖర్చులతో బోల్డ్ కంటెంట్ తో అర్జున్ రెడ్డి అనే సినిమాని డైరెక్ట్ చేసి... చాలా కాంట్రవర్సీల మధ్యన తన సినిమాని విడుదల చెయ్యడానికి నానా కష్టాలు పడ్డాడు దర్శకుడు సందీప్ వంగా. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి భారీ కాంట్రవర్సీలతో విడుదలైనా.. అంతే భారీ హిట్ కొట్టింది. యూత్ కి నేరుగా అర్జున్ రెడ్డి ఫీవర్ ఎక్కేసింది. ఒకే ఒక్క దెబ్బకి విజయ్ స్టార్ హీరో అవ్వగా... సందీప్ వంగా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా చాలామంది స్టార్స్ తో కొన్ని పార్టీలలో పాల్గొని, వారితో ఫొటోస్ దిగాడు. దానితో సందీప్ వంగా రెండో సినిమా మహేష్ బాబు తో చేయబోతున్నాడని, మహేష్ కూడా సందీప్ తో టచ్ లో ఉన్నాడనే న్యూస్ నడిచింది. 

Advertisement
CJ Advs

అయితే తెలుగులో హిట్ అయిన అర్జున్ రెడ్డిని తమిళ, హిందీలలో రీమేక్ ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. తెలుగులో ఏ హీరో సందీప్ వంగాతో చెయ్యడానికి డేర్ చెయ్యకపోయేసరికి సందీప్ తన కథని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో సినిమా తెరకెక్కించాడు. రీసెంట్ గా విడుదలైన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బాక్సాఫీసు వద్ద సునామి వసూళ్లతో రెచ్చిపోతుంది. అయితే సందీప్.. అర్జున్ రెడ్డి తో ఇక్కడ హిట్ కొట్టడమే కాదు... అదే అర్జున్ రెడ్డితో హిందీలో భారీ హిట్ కొట్టాడు. అయితే కబీర్ సింగ్ హిట్ తర్వాత సందీప్ వంగా మళ్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుగులో చేస్తాడా? లేదంటే మళ్ళీ బాలీవుడ్ లోనే సినిమా చేస్తాడా? అనేది క్లారిటీ లేదు. 

ఎందుకంటే బాలీవుడ్ లో కబీర్ సింగ్ చూసిన స్టార్ హీరోలెవరైనా సందీప్ కి గాలం వేస్తే.. తెలుగులో సందీప్ సినిమా చెయ్యడానికి టైం పడుతుంది. ఇక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మేకింగ్ కి ఫిదా అయిన టాలీవుడ్ స్టార్ హీరోలెవరైనా సందీప్ ని లాక్ చేసినా చెయ్యొచ్చు. కానీ సందీప్ మాత్రం తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అనే దాని మీద ప్రేక్షకుల్లో మాములు ఇంట్రెస్ట్ లేదు.

Discussions on Sundeep Vanga next Film:

Sundeep Vanga Directed Kabir Singh Released and get Positive Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs