Advertisement
Google Ads BL

‘అర్జున్ రెడ్డి’ని మరిచిపోలేకపోతున్నాడట!


విజయదేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఏ రేంజ్‌ సూపర్ డూపర్ హిట్టయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ సినిమాను ఇతర బాషల్లోకి రీమేక్ చేసుకుంటున్నారంటే ఇక ఈ సినిమా రేంజ్‌ గురించి అస్సలేమాత్రం డిస్కషన్ అక్కర్లేదు మరి. ఇటీవల ఇదే అర్జున్‌ రెడ్డి బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా విడుదలైంది. అక్కడ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే.. కొందరు రివ్యూలు నెగెటివ్ రేటింగ్స్ ఇవ్వడం.. హీరో పాత్ర సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని నెటిజన్లు కాసింత అసహనానికి ఆగ్రహానికి లోనై విమర్శలు గుప్పించారు. 

Advertisement
CJ Advs

ఈ విమర్శలకు టాలీవుడ్ హీరో సందీప్ కిష‌న్ కౌంట‌ర్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ఈ యంగ్ హీరో.. వ్యక్తిగత అభిరుచి మేర‌కు సినిమా ఎలా ఉందో నిర్ణయించడం ఒక ప‌ద్ధతని.. అయితే ఆ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులు ఎలాంటివారో నిర్ణయించడం మాత్రం అహంకారమని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అంతటితో ఆగని సందీప్.. తనకు మాత్రం ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెగ నచ్చేసిందని చెప్పుకొచ్చాడు.

అంతేకాదండోయ్.. ఒక్క మాటలో చెప్పాలంటే సందీప్ కిషన్.. అర్జున్‌ రెడ్డిని మరిచిపోలేకపోతున్నారట. టాలీవుడ్‌లో ఎన్ని సినిమాలొచ్చినా ‘అర్జున్ రెడ్డి.. అర్జున్ రెడ్డే’ అన్నంతగా చెప్పుకొచ్చారు. అయితే సందీప్ కిషన్ కామెంట్స్‌కు, కౌంటర్‌కు తెలుగు, హిందీ ‘అర్జున్ రెడ్డి’లు పడనివాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Sundeep Kishan Sensational Comments on Arjun Reddy:

Sundeep Kishan Fires on Arjun Reddy Movie haters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs