Advertisement
Google Ads BL

కొడుకుతో నాని క్యూట్ వీడియో!


నేచురల్ స్టార్ నాని రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడో కొత్తగా చెప్పనక్కర్లేదు. షూటింగ్‌లో గ్యాప్ దొరికినప్పుడల్లా  ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడిపేస్తుంటాడు. ఇందుకు ఆయన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లే నిదర్శనం. అటు ఫ్యామిలీకి.. ఇటు అభిమానులు, సినీ ప్రియులకు చాలా దగ్గరగా ఉంటూ తన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా కుమారుడితో ఆడుకుంటున్న క్యూట్ వీడియోను నాని సతీమణి అంజన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Advertisement
CJ Advs

ఈ వీడియోలో.. జున్ను బాబు ఇంట్లో బెడ్ కింద నుంచి వస్తుంటే నాని వెళ్లి పట్టుకొని ఎత్తుకొని అలా తిప్పుతూ భుజాన కూర్చోబెట్టుకుంటాడు. అర్జున్‌ను చూసిన నాని నవ్వేస్తాడు. ఈ క్యూట్.. క్యూట్‌గా ఉండే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ఆయన అభిమానులంతా వావ్.. నేచురల్ స్టార్.. ఇట్స్ సో నేచురల్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. మరికొందరు అదృష్టం మీదే అంజన అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న నాని కొద్దిరోజుల క్రితమే ‘గ్యాంగ్ లీడర్’ మూవీ షూటింగ్ పూర్తవ్వగా త్వరలోనే అభిమానుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా విడుదలైన తర్వాత నాని మళ్లీ వరుస సినిమాలతో బిజిబిజీగా గడపనున్నాడు.

Click Here for Video

Nani wife anjana posted her son Cute video:

Nani and his son Arjun Cute video sensation in social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs