Advertisement
Google Ads BL

ఆ కామాంధుడ్ని కఠినంగా శిక్షించాలి: రష్మీ


తెలంగాణలోని హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంతటి దారుణానికి పాల్పడినప్పటికీ నిందితుడ్ని ఎందుకిలా ఉరితీయకుండా భూమ్మీద బతకనిస్తున్నారని పలువురు ఆగ్రహావేశాలతో కట్టలు తెంచుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే.. సమాజంలో జరిగే దాదాపు అన్ని విషయాలపై అప్పుడప్పుడు స్పందిస్తుండే జబర్దస్త్ యాంకర్, నటి రష్మి గౌతమ్ ఈ ఘటనపై తాజాగా రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు అత్యాచారానికి గురైన 9 నెల‌ల పాప ఏం బ‌ట్టలు వేసుకుంది? తన అందాలను చూపించిందా? కాళ్లు చూపించిందా? ఏదైనా వివాదంపై తన అభిప్రాయం చెప్పిందా? ఆమె ఏం చేసింది? అంటూ ప్రశ్నలు గుప్పించింది. 

అయితే.. రష్మీ  అడిగిన ప్రశ్నలపై పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలబడి.. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని.. బహిరంగంగా అందరి ముందూ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు సైతం నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Rashmi serious on Hanmakonda 9 months Baby Issue:

Rashmi Serious posts in her Twitter Account
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs