Advertisement
Google Ads BL

‘మా’ తొలి జనరల్‌ బాడీ మీటింగ్‌ సక్సెస్!


మా తొలి జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఎంతో ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణంలో జ‌రిగిందిః న‌రేష్ 

Advertisement
CJ Advs

‘‘యూనిటి, ట్రాన్ఫరెన్సీ, డెమొక్రసీ పద్ధతుల్లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ముందుకు సాగుతుంది. మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జనరల్‌ బాడీ మీటింగ్‌ స్నేహపూర్వకంగా, కోలాహ‌లంగా విజయవంతంగా సాగింది’’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ అన్నారు. నటుడు నరేష్‌ అధ్యక్షుడిగా ఇటీవల‌ కొత్త కమిటీ ఎన్నికైన‌ విషయం విదితమే. ఆదివారం తొలిసారి జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘మొదట ‘మా’లో చిన్న చిన్న మనస్పర్థలు ఉండేవి. దీంతో ఎలా జరుగుతుందో అన్న భయం ఉండింది. కానీ బాగా జరిగింది. ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని ఊహించలేదు. సమావేశంలో కొంత ఆవేశానికి గురైనా, అంతిమంగా ఆరోగ్యకరంగా సాగడం ఆనందంగా ఉంది. మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ కలిసి అన్నీ సెట్‌ చేశారు’’ అని అన్నారు. 

ట్రెజరర్‌ రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. ‘‘ఈ సమావేశంలో సీనియర్లు పరుచూరి బ్రదర్స్‌, దేవదాస్‌ కనకాల‌, కృష్ణంరాజు దంపతుల‌ను సత్కరించుకున్నాం. భవిష్యత్‌లో చేయాల్సిన పనుల‌పై చర్చించుకున్నాం. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాల‌ను తెలియజేశారు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తాం’’ అని చెప్పారు. 

‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. ‘‘మొదటి జనరల్‌ బాడీ మీటింగ్‌ చాలా బాగా జరిగింది. ‘మా’కి గతంలో ఏఎన్నార్‌, ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి ముఖ్య సహాయదారులుగా ఉండేవాళ్ళు. అలా ఈ సారి కృష్ణంరాజుగారిని ఎన్నుకున్నాం. ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. కొత్త కమిటీ వచ్చిన వారం రోజుల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. 30కాల్స్‌ వచ్చాయి. సలహాల‌ బాక్స్‌కి మంచి స్పందన వచ్చింది. 33 మందికి ఇచ్చే పెన్షన్‌ ఆరు వేల‌కు చేశాం. మేడే రోజున‌ పెన్షన్‌ డేగా జరుపుకోబోతున్నాం. మెంబర్‌ షిప్ ని కొత్త‌వాళ్ళ‌కి రూ.25వేల‌కు ఇవ్వాల‌ని, రెండేండ్లు 25వేల చొప్పున చెల్లిస్తే పూర్తి స్థాయి మెంబర్‌ షిప్‌ వస్తుంది. అలాగే 90రోజుల్లో పూర్తి పేమెంట్‌ కడితే పదిశాతం డిస్కౌంట్‌ ఇవ్వాల‌ని నిర్ణయించాం. ఇన్సురెన్స్‌ తీసుకొచ్చాం. మెడిక్లేయిమ్‌ ద్వారా రూ29ల‌క్షలు జమ అయ్యింది. దీని ప్రకారం ప్రతి ఆర్టిస్టుకి మూడు ల‌క్ష‌ల ఇన్స్ రెన్స్ వర్తింపచేస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, 3 నుంచి ఐదు ల‌క్షల‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆర్టిస్టుల‌కి వర్తించేలా చేస్తామని మంత్రి తల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ హామీ ఇచ్చారు. 30 మందికి ప్ర‌భుత్వ పెన్ష‌న్స్ ఇవ్వ‌నున్నాం. అలాగే కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌థ‌కాలు వ‌ర్తింప చేస్తామ‌ని మంత్రి చెప్పారు. ‘మా’ బిల్డింగ్‌ కోసం చిరంజీవి సపోర్ట్‌ చేస్తానన్నారు. మంత్రి గారు కూడా ల్యాండ్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఫిల్మ్‌ నగర్‌లో ఇవ్వాల‌ని కోరుతున్నాం. భవిష్యత్‌లో హీరోల‌తోపాటు ప్రజలతో మమేకమై రెండు తెలుగు స్టేట్స్ లో మంచి కార్యక్రమాలు చేయాల‌నుకుంటున్నాం. గర్వించే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సాధించిన కెసిఆర్ కి, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు’’ అని చెప్పారు. 

నటి హేమ మాట్లాడుతూ, ‘మా’లో వంద మంది మహిళలున్నారు. వారికి అవకాశాలివ్వాల‌ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, రైట‌ర్స్ ని కోరుతున్నాం. తెలుగు ఆర్టిస్టుల‌ని ప్రోత్స‌హించాల‌ని కోరుతున్నా’ అని అన్నారు. ఈ కార్య్ర‌క‌మంలో శివ‌బాలాజీ, సురేష్ కొండేటి, సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, పరుచూరి బ్రదర్స్ , కవిత, కృష్ణంరాజు దంపతులు, మా సభ్యులు పాల్గొన్నారు. 

MAA First General Body meeting Success :

MAA First General Body meeting Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs