Advertisement
Google Ads BL

తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధానికి ఈ చిత్రం నిదర్శనం


జూలై రెండోవారంలో ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం - క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు 

Advertisement
CJ Advs

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’. జూన్‌ 24న సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకోనుంది. జూలై రెండోవారంలో సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో చిత్ర సమర్పకులు, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌.రామారావు విలేకరులతో మాట్లాడారు. 

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ‘‘మా బేనర్‌లో రాబోతున్న మంచి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. జూన్‌ 24న సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తమిళ్‌లో తీసిన ‘కణ’ సినిమా చూసి.. మంచి సినిమా, ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు చూపించాలన్న ఉద్దేశంతో ఆ సినిమా రైట్స్‌ తీసుకున్నాం. ఆ సినిమాలో నటించిన ఐశ్వర్యా రాజేష్‌ మన తెలుగు అమ్మాయి. అప్పటికే తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఐశ్వర్యా రాజేష్‌ ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నటించిన రాజేష్‌ కుమార్తె. రాజేష్‌ తండ్రి అమర్‌నాథ్‌ కూడా సీనియర్‌ హీరో. అలాగే మన కమెడియన్‌ శ్రీలక్ష్మీకి మేనకోడలు. వీళ్ల వారసత్వ నటన ఆ అమ్మాయిలో కూడా ఉంది. క్రికెట్‌ బేస్‌తో పాటు కంటెంట్‌ ఉండే స్టోరి. అందరి సహకారంతో సినిమాను జూలై రెండోవారంలోపు రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం.

తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మంచి ఎమోషనల్‌ స్టోరి ఇది. ఒక సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఆయనకు క్రికెట్‌ అంటే ఉన్న అభిమానాన్ని అబ్జర్వ్‌ చేసి ఎలాగైనా మంచి క్రికెటర్‌ అయ్యి ఇండియాకు ఆడాలనుకునే అమ్మాయి కథ. ఐశ్వర్య ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి క్రికెట్‌ నేర్చుకుని మరీ నటించింది. ఈ చిత్రం క్రికెట్‌ అభిమానులతో పాటు యూత్‌కి, ఫ్యామిలీస్‌కి కూడా బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా దర్శకుడు భీమనేని ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో రైతుల సమస్యలకి సంబంధించిన స్టోరి కూడా ప్యార్‌లల్‌గా రన్‌ అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఇన్‌స్పిరేషన్‌ కలిగిస్తుంది. రాజేంద్రప్రసాద్‌గారు తండ్రిగా ఒక అద్భుతమైన క్యారెక్టర్‌లో నటించారు. తండ్రీ కూతుళ్ళ ఎమోషనల్‌ కథే ఈ సినిమా. ఈ సినిమాలో తమిళ్‌ హీరో శివకార్తికేయన్‌ మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ అమ్మాయికి ఒక ఎయిమ్‌ టార్గెట్‌ చేసి ఇండియాకి సెలెక్ట్‌ అయ్యేవిధంగా చేసే కీలక పాత్రలో ఆయన నటించారు. తమిళ్‌లో తన బేనర్‌ అయిన ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌లో రామరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దిబు థామస్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌. సౌత్‌ ఇండియాలోనే ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ క్రియేట్‌ చేసిన దిబు థామస్‌ ఈ సినిమాకి మంచి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు.

హీరోయిన్‌ మదర్‌ క్యారెక్టర్‌లో ఝాన్సీ బాగా చేసింది. అలాగే నా మిత్రుడు వైజాగ్‌ రాజు కుమారుడు కార్తీక్‌ రాజు ఒక మంచి క్యారెక్టర్‌ చేశాడు. చిన్న క్యారెక్టరే అయినా చాలా అద్భుతంగా నటించాడు. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌, టెక్నీషియన్స్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశారు. త్వరలోనే సోని మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలవుతాయి. అలాగే ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవిగారు విడుదల చేసిన టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. జూలై 2న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్‌కి విమెన్‌ ఇండియన్‌ టీమ్‌కి కెప్టెన్‌గా చేసిన మన హైదరాబాదీ మిథాలీ రాజ్‌తో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు’’ అన్నారు. 

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌ (స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజా కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

Kousalya Krishnamurthy Release Date Fixed:

Producer KS Rama Rao Press Meet About Kousalya Krishnamurthy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs