Advertisement
Google Ads BL

ఇకపై సమంత రేంజే వేరప్పా..!


మన సౌత్ హీరోయిన్స్ లో కమర్షియల్‌ హీరోయిన్ గా సక్సెస్ అవుతూ.. పెర్‌ఫార్మెన్స్‌ వైజ్ కూడా తమకు తిరుగు లేదని నిరూపించుకున్న హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉన్నారు. వీరిలో సమంత ఒక్కరు. ఇలా ఆమె రెండు విధాలుగా మెప్పిస్తుంది. సామ్ ను ప్రతిభావంతురాలు అనడంలో సందేహం లేదు.

Advertisement
CJ Advs

ఆమె కామెడీ చేసినా చూసే జనాలు ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఎమోషన్స్‌ పలికించే తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా మజిలీ సినిమాలో ఆమె ఎంట్రీ సీన్ థియేటర్స్ లో విజిల్స్ తో మారుమోగిపోయాయి. ఈసినిమాతో  నటిగా ఆమె రేంజ్ మారిపోయింది. అందుకే ఇక్కడ నుండి తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉండే పాత్రలే చేయాలనీ నిర్ణయించుకుంది ఈ బ్యూటీ. తనకు నచ్చిన కథలే చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సామ్ నటించిన ‘ఓ బేబీ’ అనే కొరియన్ రీమేక్ చిత్రం అతి త్వరలో విడుదల కాబోతోంది.

రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ లో సామ్ ను చూస్తూనే ఆ పాత్ర కోసం ఎంతగా లీనమయిందనేది అర్థమవుతుంది. ఈ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేనప్పటికీ ట్రైలర్ లో సామ్ నటన చూస్తే కచ్చితంగా ఈమూవీ చూడాల్సిందే అనే భావన కలుగుతుంది. ఈమూవీ తో సామ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోగలిగితే ఆమెపై మరిన్ని అద్భుతమైన పాత్రలు ఆశించవచ్చు అనిపిస్తోంది. 

Samantha Range increased :

Samantha Oh Baby Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs