తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సర్కార్‌కు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, రవితేజ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇద్దరు ట్వీట్లు చేశారు అంతా బాగుంది.. అంతటితో ఆగుంటే సరిపోయేది అయితే.. #kaleswaram అని ట్యాగ్ చేశారు అది కూడా ఓకే @KTRTRS @TelanganaCMO అని ట్యాగ్ చేసి ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ రెండు ట్యాగ్‌లు చేసిన హీరోలు కాళేశ్వరం మూలపురుషుడు, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కర్త, కర్మ, క్రియ అయిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును మరిచారని ఆయన అభిమానులు, పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కన్నెర్రజేస్తున్నారు.
మొత్తానికి చూస్తే.. ఈ ట్రోలింగ్స్ చూసిన నాగ్, రవితేజ ట్వీట్ చేసి తప్పుచేశామని అనుకుని ఉంటారేమో. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హరీష్ హాజరుకాలేదు. అయితే సిద్దిపేట జిల్లాలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేడుకలకే హరీష్ పరిమితమయ్యారు.