Advertisement
Google Ads BL

‘అల్లు’వారింట రహస్యంగా రెండో పెళ్లి!


అవును మీరు వింటున్నది నిజమే.. అల్లు వారింట రెండో పెళ్లి జరిగింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీకి బయటివారైన మూడో కంటికి తెలియకుండా చాలా సీక్రెట్‌గా పెళ్లి జరిగింది!. శుక్రవారం నాడు అనగా జూన్-21న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య బాబీ.. నీలు అనే యువతిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో పెద్ద ఎత్తున హల్‌చల్ చేస్తున్నాయి.

Advertisement
CJ Advs

కాగా.. ఈ ఫొటోల ప్రకారం చూస్తే అల్లు శిరీష్ తప్ప వివాహ వేడుకల్లో మరెవ్వరూ ఉన్నట్లు లేరని.. అసలు ఈ పెళ్లి అల్లు అరవింద్‌కు, అల్లు అర్జున్‌కు తెలియకుండా లేదా వారికి నచ్చకపోవడంతో బాబీనే చేసుకున్నాడనే పుకార్లూ వస్తున్నాయి. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఇంత వరకూ అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అయితే అత్యంత సీక్రెట్‌గా ఈ వివాహం ఎందుకు జరిగిందనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో మెదులుతున్న ఏకైక ప్రశ్న.

ఇదిలా ఉంటే.. అల్లు బాబీకి ఇదివరకే మొదటి వివాహం అవ్వగా ఆ జంట కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే బాబీకి అన్విత అనే కుమార్తె కూడా ఉంది. కాగా.. ఈ సీక్రెట్ పెళ్లి వ్యవహారంపై అల్లు కుటుంబ సభ్యులు రియాక్ట్ అవుతారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అన్నది తెలియాల్సి ఉంది.

Allu Bobby Second Marriage Photos Creates Sensation in Social Media:

Allu Bobby Second Marriage News
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs