బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో నటించే ఛాన్స్ రాకపోవడం దురదృష్టంగా భావిస్తున్నానని అంటుంది మరొక నటి దిశా పటానీ. రీసెంట్ గా మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీడియా వారు ‘భారత్ సినిమాలో అవకాశం వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు?’ అని అడిగిన ప్రశ్నగాను ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.
సల్మాన్ లాంటి స్టార్ హీరోతో నటించడం నా అదృష్టం. ఆయన కష్టపడే వ్యక్తి. ఆయన అందరితో మంచిగా ఉంటారు. ఆయన ప్రతి ఒక్కరితో ఒదిగి ఉండటం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అయితే ఈసినిమాలో కత్రినా కైఫ్ కూడా నటించింది. కానీ కత్రినాతో తెర పంచుకోలేకపోయానన్న బాధ మాత్రం అలాగే ఉంది. ఆమెకు నాకు వేరువేరు సీన్స్ రావడంతో ఇద్దరం కలిసి నటించే అవకాశం రాలేదు. ఇద్దరం ఒకే సినిమాలో ఉన్నప్పటికీ ఆమెతో కలిసి నటించే అవకాశం రాకపోవడం నా దురదృష్టం అని వెల్లడించింది దిశా. ప్రస్తుతం ఈమె ‘మలంగ్’ సినిమాలో నటిస్తున్నారు.