Advertisement
Google Ads BL

ఫిదా కాంబో.. హీరో మారాడంతే!


నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా.. బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా అనౌన్స్  అయింది.

Advertisement
CJ Advs

డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా అతి తక్కువ టైమ్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథ విపరీతంగా నచ్చడంతో హీరో హీరోయిన్లిద్దరూ బల్క్ డేట్స్ కేటాయించారు. దీంతో కేవలం 60 -70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. మొత్తంగా ఈ సినిమా ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకూ అంతా సెన్సేషనల్ పీపులే ఉండటంతో ఇండస్ట్రీలో ఈ అనౌన్స్ మెంట్ ఆసక్తిని

పెంచింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో నటించే ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.

Chaitu and Sai Pallavi in Sekhar Kammula Direction:

Sekhar Kammula Next Film With Chaitu and Sai Pallavi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs