Advertisement
Google Ads BL

ఇలా అయితే విజయ్ తమ్ముడు కష్టమే..?


ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వతహాగా హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ అంటే పడిచచ్చిపోయే ఫ్యాన్స్ ఇప్పుడు చాలా మందే ఉన్నారు. విజయ్ సినిమాలంటే అభిమానులకు పిచ్చ క్రేజ్. అయితే విజయ్ క్రేజ్‌తో ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో అయ్యాడు. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతూ ఆనంద్ దేవరకొండతో కలిసి దొరసాని సినిమా చేసింది. దొరసాని టీజర్ ఈ మధ్యనే విడుదలై అందరిని ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

అయితే ఆనంద్ కి ఎక్కడా అన్న సపోర్ట్ లేదు. నటన, లక్కుంటే హీరో అవుతాడంటూ.. విజయ్ తన తమ్ముడిని వదిలేసాడు. ఇక మరోపక్క సినిమాలో దొరసానిగా శివాత్మిక డామినేషన్ ఉండబోతుందంట. సినిమాలో దొరసానిగా శివాత్మిక చాలా ఒద్దికగా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. తెలంగాణ యాసలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంద్ లుక్స్ చాలా నార్మల్ గా వున్నాయి. 

ఇక శివాత్మిక లుక్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ... మిగతా చాలా విషయాల్లో ఆనంద్ ని డామినేట్ చేస్తుందట. శివాత్మిక ఒక్క టేక్ తో చాలా షార్ట్స్ పూర్తి చేసిందట. కానీ ఆనంద్ మాత్రం కెమెరా ముందు కాస్త తడబడుతున్నాడని... ఇక సెట్స్ లోను ఆనంద్ కన్నా ఎక్కువగా శివాత్మికనే స్పార్క్‌గా, స్పీడ్‌గా ఉంటుందని అంటున్నారు. మరి అన్ని విషయాల్లోనూ అంటే సినిమా కథలోనూ శివాత్మిక కేరెక్టర్ హైలెట్ అంటున్నారు.

ఇలా తనకన్నా ఎక్కవగా శివాత్మికకే పేరొస్తే.. మరి విజయ్ తమ్ముడు ఆనంద్ పరిస్థితి ఏమిటో? అందులోను ప్రేక్షకులంతా విజయ్ దేవరకొండ తమ్ముడు విజయ్ మాదిరిగా యాటిట్యూడ్ చూపిస్తూ అదరగొడతాడు అనుకుని థియేటర్ కి వెళితే మాత్రం చాలా నిరాశ పడటం ఖాయం అంటున్నారు.

Rajasekhar Daughter dominates Vijay Deverakonda Brother:

Anand Deverakonda Slow then Vijay Deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs