జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికలు సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి నిన్న, మొన్నటి వరకూ ఫుల్ గడ్డం, మీసాలతో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత మొక్కు తీర్చుకుంటారేమో అని అభిమానులు, కార్యకర్తలు అందరూ అనుకున్నారు. అయితే పవన్ మనసులో ఏమనుకున్నారో ఏమోగానీ.. అది కాస్త జరగలేదు. అయితే ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో రాకపోవడంతో పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తారని అందరూ భావించారు. ఈ తరుణంలో.. తన ప్రాణం ఉన్నంత వరకూ రాజకీయాల్లోనే ఉంటానని.. ప్రజాసేవ చేస్తానని పవన్ క్లారిటీ ఇచ్చేశారు.
ఈ క్రమంలో జిల్లాల వారిగా అభ్యర్థులు, ముఖ్యనేతలు, ముఖ్య కార్యకర్తలతో కలిసి మీటింగ్‌లు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అయితే ముందు మాదిరిగానే గుబురు గడ్డం.. తెల్ల లాల్చీ, పంచెకట్టుతోనే కనపడటంతో.. సార్ గెటప్ ఎప్పుడు మారుస్తారబ్బా..? అని అందరూ ఎదురుచూశారు. అంతా అనుకున్నట్లుగానే.. బుధవారం సాయంత్రం పవన్ సరికొత్త గెటప్‌లో కనిపించారు.
గడ్డం కాస్త ట్రిమ్ చేసి.. జుట్టు కూడా కాస్త కట్ చేశారు. చెక్స్ షర్ట్, జీన్స్ ప్యాంట్‌తో జనసేనాని కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ చూసిన పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే మరోవైపు టీడీపీ, వైసీపీ ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ సినిమాల కోసమేనని.. త్వరలోనే పవన్ మళ్లీ మూవీస్ మొదలెడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.