బాలీవుడ్ అందాల భామ, గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా పదే పదే వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం ఆమె ధరించిన దుస్తులే. కొన్ని రోజుల క్రితం ఆమె వేసుకున్న డ్రస్, హెయిర్ స్టెయిల్‌తో అందరి నోళ్లలో నానింది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు మార్ఫింగ్ చేసి పెద్ద హడావుడే చేశారు. అయితే తాజాగా.. ఖాకీ నిక్కర్ ధరించడంతో మరోసారి ప్రియాంక హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిగో పై ఫొటోలో చూస్తున్నట్లుగా ఖాకీ నిక్కర్, బ్లాక్ కోట్ వేసుకొని భర్త నిక్ జొనాస్‌తో కలిసి వెళుతుండగా ఎక్కడికో ప్రియాంక పయనమైంది. అక్కడే ఫొటోగ్రాఫర్లు ఉండటంతో తమ కెమెరాలకు పనిపెట్టి క్లిక్‌మనిపించారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఒకింత కంగుతిన్నారు.
వామ్మో.. ప్రియాంక రోజురోజుకూ ఇలా చేస్తోందేంటి..? కొంపదీసి ప్రియాంక ఆరెస్సెస్‌లో చేరిందా?.. లేకపోతే ఆరెస్సెస్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోందా? అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రియాంకకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. అయితే ఆర్ఎస్ఎస్ నిక్కర్ వ్యవహారంపై ప్రియాంక ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.