Advertisement
Google Ads BL

బ్ర‌హ్మానందం పుంబా అయితే ఆలీ టీమోన్!


ల‌య‌న్ కింగ్ కి డ‌బ్బింగ్ చెప్పన స్టార్ క‌మీడియ‌న్స్ బ్ర‌హ్మానందం, ఆలీ

Advertisement
CJ Advs

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పాత్రలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి యానిమేటెడ్ సినిమాగా 90లో విడుదల చేసారు. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫ్యాన్స్ కి, కామిక్ అభిమానులకి సరికొత్త అనుభూతులని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. 

అందులో భాగంగానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమాగా జులై 19న విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ విజువ‌ల్ వండ‌ర్ కి షారుఖ్ ఖాన్ గాత్ర ధానం చేశాడు. ల‌య‌న్ కింగ్ లో కీల‌క పాత్రైన ముసాఫాకు షారుక్ డ‌బ్బింగ్ చెప్పారు, ఇక ముసాఫా త‌న‌యుడు సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. అలానే ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ లో పుంబా పాత్ర‌కు హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం డ‌బ్బింగ్ చెప్పారు, అలానే టీమోన్ పాత్ర‌కు ఆలీ గాత్ర‌ధానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపంలో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదలకి రెడీ అవుతుంది.

Brahmanandam and Ali voice over to The Lion King:

Brahmanandam Voice to Pumbaa and Ali Voice to Timon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs