తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం ‘దర్పణం’. రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమయిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి స్పందన లభించగా.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ రామకృష్ణ వెంప మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా అని సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. నటీనటులందరూ చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ గారి సహకారం మర్చిపోలేనిది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది’’ అన్నారు.
నిర్మాత క్రాంతి కిరణ్ వెల్లంకి మాట్లాడుతూ.. ‘‘చాలా కష్టపడి ఇష్టపడి సినిమా చేశాము. ఈ చిత్రానికి అందరు సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని సెన్సార్ పనుల్లో ఉన్నాము. వచ్చే నెలలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలను మించి ఈ సినిమా ఉంటుంది అన్నారు.
కెమెరామెన్: సతీష్‌ముత్యాల, ఎడిటర్: సత్యగిడుతూరి, మ్యూజిక్ డైరెక్టర్: సిద్దార్ధ్ సదాశివుని, ప్రొడ్యూసర్: క్రాంతి కిరణ్ వెల్లంకి, డైరెక్టర్: రామకృష్ణ వెంప.