Advertisement
Google Ads BL

సునీల్ అటు, ఇటు కాకుండా పోతున్నాడుగా!!


కమెడియన్‌గా పిచ్చ ఫామ్ లో ఉన్నప్పుడే... హీరోయిజాన్ని చూపించడానికి బయలు దేరి కమెడియన్ వేషాలకు బై బై చెప్పేసిన సునీల్... హీరోయిజం వర్కౌట్ కాక మళ్ళీ కమెడియన్ గా మారాడు. కానీ సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అవడంతో సునీల్ కి కమెడియన్ గా కూడా కష్టాలు మొదలయ్యాయి. వెన్నెల కిషోర్ మెల్లగా కమెడియన్ గా టాప్ పొజిషన్ కి చేరుకుంటున్నాడు. వెన్నెల కిషోర్ నటించిన సినిమాలు వరసగా ప్లాప్ అయినా.. వెన్నెల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చిన్న చితక సినిమాలు పక్కన పెడితే.. వెన్నెల కిషోర్ ఇండియా వైడ్ గా పాపులర్ కాబోతున్నాడు. ప్రభాస్ సాహో సినిమాలో వెన్నెల కిషోర్ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

ఇక జబర్దస్త్ నుండి రోజుకో కమెడియన్ వెండితెర మీద హల్చల్ చేసున్నాడు. మరి ఒకప్పుడు హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచిన సునీల్ నేడు.. ఐరెన్ లెగ్ మాదిరిగా కనబడుతున్నాడు. హీరోగా మంచి ఫిజిక్ మెయింటైన్ చేసిన సునీల్... ఇప్పుడు కమెడియన్ గా మారాక బాగా లావుగా తయారయ్యాడు. ఇక సునీల్ వేసే పంచ్ లు ఏ సినిమాలోనూ పేలడం లేదు. మరి ఫ్రెండ్ త్రివిక్రమ్ కూడా సునీల్ ని ఏ మాత్రం ఆదుకుంటాడో అనేది ఇప్పుడు డౌట్. ఇక సునీల్ హీరోయిజం పక్కనబెట్టి మళ్లీ కమెడియన్ గా మారాక తన హవా పెరుగుతుంది అనుకుంటే... ఇప్పుడు సునీల్ కమెడియన్ గా కూడా పనికి రాకుండా పోయేలా కనబడుతున్నాడు. మరి చాలామంది ఇక ఇండస్ట్రీలో సునీల్ కి కష్టమే అంటున్నారు.

Bad Time to Actor and Comedian Sunil:

No Movies to Comedian Sunil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs