Advertisement

ఈ మూవీ ‘చూడాలని ఉంది’: చిరంజీవి


టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తప్పకుండా కౌసల్య కృష్ణమూర్తి మంచి విజయం సాధిస్తుంది- మెగాస్టార్ చిరంజీవి  

Advertisement
-->

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్’. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్ర టీజర్‌ను జూన్‌ 18న మెగాస్టార్‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మా కె.ఎస్‌. రామారావుగారి నిర్మాణ సారథ్యంలో మిత్రుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రికెట్‌ నేపథ్యంలో వస్తోన్న విభిన్న కథాంశమిది. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. నేషనల్‌ వైడ్‌గా స్పోర్ట్స్‌ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించింది. గేమ్స్‌కి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇండియాలో క్రికెట్‌ అనేది ఒకరకంగా చెప్పాలంటే నేషనల్‌ గేమ్‌లాంటిది. దాని బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఇందులో హీరోయిన్‌గా చేసిన ఐశ్యర్యా రాజేష్‌... సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక ఉమెన్‌ క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. క్రికెటర్‌ క్యారెక్టర్‌‌ని జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత షూటింగ్‌ చేయడం ప్రారంభించింది అంటే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్‌, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఐశ్వర్యా రాజేష్‌ ఎవరో కాదు.. మా కొలీగ్‌ రాజేష్‌ కూతురు. అలాగే కమెడియన్‌ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం అన్నది శుభపరిణామం. నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను.

ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎలాంటి ప్రోత్సాహం లేని వాతావరణం నుండి వచ్చి తనకు తానుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేవిధంగా క్లైమాక్స్‌ ఉంటుంది అని చెప్పారు. నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుంది. మంచి విజయవంతమైన సినిమాలకు పెట్టింది పేరైన క్రియేటివ్‌ కమర్షియల్స్‌కి ఇది మరో విజయం అవుతుంది. అలాగే కమర్షియల్‌తో పాటు మంచి ఇతివృత్తాలను తీసుకునే తెరకెక్కించే భీమనేని శ్రీనివాసరావుకి ఇది ఒక మైలుస్టోన్‌ మూవీగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్రతి ఒక్క యూనిట్‌ సభ్యునికి హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అన్నారు. 

Chiranjeevi Launches Kousalya Krishnamurthy Teaser:

Chiranjeevi Speech at Kousalya Krishnamurthy Teaser Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement