Advertisement
Google Ads BL

జబర్దస్త్ కి టాటా చెప్పేస్తుందా?


ఈటీవీలో తెగ ఫేమస్ అయిన జబర్దస్త్ కి అంతగా పేరు రావడానికి.. ఒక విధంగా జబర్దస్త్ లోని జోక్స్ కారణమైతే.. మరో విధంగా హాట్ యాంకర్ అనసూయ కారణం. పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టినా... అందాన్ని అప్సరసలా కాపాడుకుంటూ.. హాట్ యాంగిల్స్ లో హీరోయిన్స్ కే పోటీ ఇచ్చే అందంతో అదరగొడుతూ.. జబర్దస్త్ ని ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత అనసూయాది.  ఇక అనసూయ కాస్త రెమ్యూనరేషన్ పెంచిందనే కారణంగా రష్మిని పెట్టినా....  జబర్దస్త్ అంతగా క్లిక్ అవకపోయేసరికి అనసూయని జబర్దస్త్ కి రష్మిని ఎక్స్ట్రా జబర్దస్త్ కి పెట్టారు. జబర్దస్త్ తో మంచి ప్లాట్ ఫామ్ సంపాదించిన అనసూయ మెల్లగా వెండితెర మీద కూడా కాలు పెట్టింది. తనకు సరిపోయే పాత్రలతో వెండితెర మీద కూడా క్లిక్ అయ్యింది. క్షణంలో పోలీస్ ఆఫీసర్ గా, రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయకి చిరు - కొరటాల మూవీలో ఓ కీలక పాత్ర పోషించబోతుంది . ఇక అనసూయ మెయిన్ లీడ్ లో కథనం సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

Advertisement
CJ Advs

అయితే వెండితెర మీద సినిమా అవకాశాలు బాగా రావడంతో అనసూయ జబర్దస్త్ షోకి బై బై చెప్పెయ్యబోతుందనే న్యూస్ జబర్దస్త్ అభిమానులను ఒకింత షాకుకు గురి చేస్తుంది. తనకెంతో పేరు తెచ్చిన జబర్ధస్త్‌ ప్రోగ్రాంకు, తనకెంతో ఇష్టమైన సినిమాలకు టైమ్ కేటాయించలేకపోతున్నట్టు అనసూయ సన్నిహితుల వద్ద చెప్పుకుంటుందట. అయితే  అనసూయ ఇప్పుడు చేస్తోన్న జబర్థస్త్ ప్రోగ్రాంకు కాస్తంత విరామం ఇచ్చి పూర్తిగా తన సమయాన్ని సినిమాలకు కేటాయించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మరి తన గ్లామర్ తో జబర్దస్త్ కి ఓ నిండుతనాన్ని తెచ్చిన అనసూయ యాంకరింగ్ లేకపోతే ఆ షో పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం.

Shocking News to Jabardasth Fans:

Anasuya Says Goodbye to Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs