Advertisement
Google Ads BL

ఎన్నికలు వద్దు..: ప్రతాని!


ఎన్నికలు వద్దు.. ఉపసంహరణే ముద్దు  - నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ 

Advertisement
CJ Advs

నిర్మాతల మండలికి ఎన్నికలు అవసరం లేదని చాలా మంది నిర్మాతల అభిప్రాయం అని అంటున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. 

తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి  ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా నిర్మాతల మండలికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్ ని ఎంపికచేసింది. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి . అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి చాలా బాగా జరుగునున్న క్రమంలో కొందరు కావాలని ఇష్యుస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్ ఎల్ పి అంటూ ఛానల్స్ విషయంలో సపరేట్ గా ఉండడంతో కౌన్సిల్ కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను సాల్వ్ చేస్తానని నిర్మాత సి కళ్యాణ్ గారు చెప్పారు. ఎన్నికల విషయంలో కూడా అనవసరంగా ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరు ఒక్కటిగా ప్యానల్ ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో ఎఫ్ డి సి చైర్మన్ రామ్మోహనరావు, సురేష్ బాబుతో కూడా మాట్లాడాను, దాంతో పాటు చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా అదే. 

ఈ నెల 18న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల తరువాత  చేసే బదులు ముందే చేస్తే ఎన్నికలు లేకుండానే నిర్మాతల ప్యానల్ ని ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు నిర్మాతల మండలి ఆధ్వర్యంలో హెల్త్ కార్డ్స్, పేద విద్యార్థులకు చదువులకు సహాయం చేయడం లాంటివి చేస్తున్నాం. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరి ఉద్దేశం ఒక్కటే.. ఎన్నికలు వద్దు. అందరు పెద్ద వాళ్లతో కూర్చుని నిర్మాతల మండలి ప్యానల్ ని ఎంపిక చేస్తే బాగుంటుంది. రేవు 18న విత్ డ్రా చేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ముందుకు రావాలని  అన్నారు. 

మరో నిర్మాత శంకర్ గౌడ్ మాట్లాడుతూ..  అందరం కలిసిపోయి నిర్మాతల మండలి ఎన్నికల విషయంలో ఓ మాటమీదుంటే బాగుంటుంది. వాళ్ళు 70 శతం ఉంటే మనం 30 శాతం ఉన్నాం. అందరు ఒకే తాటిపై ఉండాలని కోరుకుంటున్నాను. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.. అందులో తెలంగాణ నిర్మాతలకు ఇద్దరు ముగ్గురికి పదవులు ఇవ్వరా.  ఎప్పుడు మీరే ఆ పదవుల్లో ఉంటారా. ఆ కమిటీలో ఈ సరైన తెలంగాణ వారికీ మంచి పదవులు వస్తాయని భావిస్తున్నాను అన్నారు.                                                             

మరో నిర్మాత జె వి ఆర్ మాట్లాడుతూ..  గత ఆరు సంవత్సరాలుగా కౌన్సిల్ వ్యవహారాలను సద్దుమణిగేలా చేసి ఇప్పుడు కౌన్సిల్ ని మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ ఆరేళ్ళు ఎందుకు కౌన్సిల్ విషయంలో ఎవరు మాట్లాడలేదు. అందులో డబ్బు విషయంలో చాలా ఫ్రాడ్ జరిగింది. దాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు. ఫ్రాడ్స్ ను ఎందుకు శిక్షించలేదు. అవకతవకలను కప్పిపుచ్చడానికి ఎన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎందుకు ఎన్నికలు పెడతామని అంటున్నారు. ఎన్నికలు పెట్టడం అవసరం లేదు.. అందరు కూర్చుని మాట్లాడుకుని ఒకే మాటపై కౌన్సిల్ సభ్యులను నియమించేసుకుందాం అని సాయి వెంకట్  అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నిర్మాతలు పాల్గొన్నారు.

No Elections.. Says Pratani Ramakrishna Goud :

Producers Council Elections Press Meet Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs