జక్కన్న చాలా పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కి వెళ్తారు. ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకుని నాలుగైదు రోజులు పాటు వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేసి షూటింగ్ కి వెళ్తారు కానీ అక్కడ పరిస్థితులు వల్ల అనుకున్న సమయానికి సినిమాని రిలీజ్ చేయలేడు. అది క్వాలిటీ విషయంలో కావొచ్చు... మేకింగ్ టైంలో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం వల్ల కావచ్చు.. ముందుగా ప్రకటించిన డేట్స్ చాలా సార్లు మిస్ చేసాడు రాజమౌళి.
‘ఈగ’, ‘బాహుబలి’ రెండు భాగాలు రిలీజ్ డేట్స్ విషయంలో ఇదే జరిగింది. అయితే ఈసారి RRR విషయంలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తేడా రాకూడదని ముందుగానే అంటే ఏడాది ముందే రిలీజ్ డేట్ ప్రకటించేసారు. జూలై 30, 2020 లో ఈమూవీ రిలీజ్ చేస్తున్నాం అని అధికారంగా ప్రకటించారు. అయితే ఈ డేట్ విషయంలో విలేకరులు నొక్కి నొక్కి అడిగితే మాత్రం.. ఒకవేళ డేట్ మారొచ్చేమో కానీ.. సంవత్సరం మాత్రం మారదని తేల్చి చెప్పాడు జక్కన్న. ఇక్కడే ఆయన రిలీజ్ డేట్ విషయం అడ్వాంటేజ్ తీసుకునేశాడు.
షూటింగ్ లేట్ అవ్వడంతో రిలీజ్ డేట్ మారె అవకాశముందని అర్ధం అవుతుంది. కారణం.. ఈచిత్ర షూటింగ్ టైములో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరి తర్వాత ఒకరు గాయపడి షూటింగ్‌కు దూరం అయ్యారు. ఇద్దరూ గాయపడి తలో నెల రోజులు షూటింగుకి దూరం కావడంతో జక్కన్న ప్లానింగ్ అంతా దెబ్బ తినేసింది. సో అనుకున్న టైములో సినిమా కావడం చాలా కష్టం అనుకుంటున్నారు. అందుకే మీడియా వాళ్ల ముందు ఓ హింట్ ఇచ్చాడు ముందుగానే. రాజమౌళి తొందరపడి సినిమాను తీసేయడు. ఎందుకంటే ఔట్ పుట్ దెబ్బ తింటుంది కాబట్టి. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అయ్యి ఉంటుందా అని ఫ్యాన్స్ ఇప్పటినుండే టెన్షన్ పడుతున్నారు.