సాధారణంగా పెద్ద హీరోస్ సినిమాలకి ముందే బిజినెస్ జరిగిపోతుంది. కొంతమంది స్టార్ హీరోల సినిమాలకి అయితే సినిమా స్టార్ట్ అయిన నెలకే సినిమా యొక్క శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్ని అమ్ముడైపోతాయి. కానీ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. అవును మీరు వింటుంది నిజమే. కొంచం ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. ప్రభాస్ లాంటి ఇండియన్ మార్కెట్ ఉన్న స్టార్ హీరో సినిమాకే ఇలా జరిగిందేంటి అని చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్‌కు ఇండియా వైడ్ మార్కెట్ వచ్చింది. కానీ సాహో సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడవ్వలేదు.
అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే...సాహో సినిమా కోసం నిర్మాతలు భారీ రేట్ చెబుతున్నారట. తెలుగులో అంత మొత్తంగా ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడంలేదు. తెలుగులో 30 కోట్ల రూపాయలు చెప్పడంతో ఎవరు అంత సాహసం చేయడంలేదు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా ఎక్కువ. మరోవైపు ఈచిత్రం యొక్క హిందీ శాటిలైట్ రైట్స్ మాత్రం 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తెలుగు శాటిలైట్ రైట్స్ 22 కోట్ల నుంచి 24 కోట్ల రూపాయల మధ్యలో అమ్ముడైనట్టు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. టీజర్ తో ఒక ఊపు ఊపేసిన ప్రభాస్ ఆగష్టు 15న దిగబోతున్నాడు.