Advertisement
Google Ads BL

హీరోలకు గాయాలు.. టెన్షన్‌లో టాలీవుడ్!


గత వారం రోజుల నుండి టాలీవుడ్ హీరోలు సినిమా షూటింగ్ లో గాయాల పాలవుతున్నారు. నిన్నగాక మొన్న నాగ శౌర్య తన సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైంది. నాలుగు వారాల పాటు ఆ హీరో రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ఇక నిన్న సందీప్ కిషన్ కూడా తెనాలి రామకృష్ణ షూటింగ్ లో గాయపడినట్లుగా సమాచారం. ఇక నేడు హీరో శర్వానంద్ కూడా సినిమా షూటింగ్ లో తీవ్ర గాయాలపాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లో సమంతతో కలిసి 96 సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. 96 సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతుంది.

Advertisement
CJ Advs

థాయిలాండ్‌లో శర్వానంద్ స్కై డైవింగ్ చేస్తుండగా... కాలికి, భుజానికి గాయాలైనట్లుగా చెబుతున్నారు. షూటింగ్ లో గాయపడిన శర్వానంద్ ని హాస్పిటల్ కి తరలించగా... ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్స్ శర్వానంద్ కి రెస్ట్ సూచించారట. అయితే శర్వానంద్ కి హైదరాబాద్ లో సన్ షైన్ హాస్పిటల్ లో వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తారని.. అది కూడా రేపు సోమవారం చేస్తారని చెబుతున్నారు. మరి హీరోలు ఇలా సినిమా షూటింగ్స్ లో గాయాల పాలవడం కామన్ అయినా.... ఒకే వారంలో ముగ్గురు హీరోలు ఇలా హాస్పిటల్ పాలవడం మాత్రం అభిమానులకు కాస్త టెంక్షన్ కి గురి చేస్తుంది.

One More Hero Injured at Shooting Spot:

Sharwanand Injured at 96 Remake Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs