Advertisement
Google Ads BL

జూన్ 30న నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు!


జూన్ 30న నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు. ‘మ‌న కౌన్సిల్‌- మ‌న‌ప్యాన‌ల్‌’ గా పోటీ చేయ‌నున్న సి.క‌ల్యాణ్‌, టి.ప్ర‌స‌న్న‌కుమార్‌ల వ‌ర్గం

Advertisement
CJ Advs

నిర్మాతల మండలి ఎన్నికలు చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చాయి. ప్రతి రెండేళ్లకొక‌సారి జరిగాల్సిన ఎన్నికలు ఎట్టకేలకు ఈ నెల 30 న  జరుగనున్నాయి.  ఈ క్రమంలో ‘మ‌న కౌన్సిల్‌- మ‌న‌ప్యాన‌ల్‌’  పేరుతో సి.కల్యాణ్,  ప్రసన్న కుమార్  కలిసి ఒక ప్యానెల్‌గా ఏర్పడి  పోటీ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో

సి.కల్యాణ్ మాట్లాడుతూ... ‘‘నిర్మాతల మండలికి అంటే నిర్మాతల శ్రేయస్సు కోసం‌ ఏర్పాటు చేసింది. అందరం ఒక్క గ్రూప్‌గా ఏర్పడి నిర్మాతల మండలిని బలంగా చేయాలని రామ్మోహ‌న్‌రావు, డి.సురేష్ బాబు, చదలవాడ శ్రీనివాసరావు, అల్లు అరవింద్ లాంటి పెద్దలందరూ ముందుకొచ్చారు’’ అన్నారు. 

చదలవాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీలో అందరం ఒక తాటి మీద ఉండాలని నిర్ణయించుకున్నాం. నిర్మాతల మండలి ఎన్నికల్లో మన ప్యానల్ మరియు గిల్డ్ ప్యానల్ సభ్యులు పోటీ చేస్తున్నారు. నిజానికి ఎన్నికలు జరగకుండా ఎకగ్రీవంగా అర్హులకు తగ్గ పదవులను ఇచ్చి నిర్మాతల‌మండలిని స్ట్రాంగ్ చేయాలన్నదే మా అందరి నిర్ణయం.‌ కానీ సమయాభావం‌వల్ల, స‌భ్యులంద‌రూ అందుబాటులో లేని‌ కారణంగా ఎన్నికలు జరుగక తప్పటం లేదు’’ అన్నారు. 

టి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. వాటిని పరిష్కారం కావాలంటే నిర్మాతలమండలి స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే రెండు ప్యానల్స్‌లో ఎవరి గెలిచినా, అందరం యునానిమస్‌గా రాజీనామాలు చేసి అర్హులైన, ఇంట్రెస్ట్ ఉన్న వారికి పదవులు అప్పగించి సినీ పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేయాలన్నదే మా అభిమతం’’ అన్నారు. 

ఈ కార్యక్రమంలో మోహన్ వడ్లపట్ల, వై.వి.ఎస్ .చౌదరి, రామ సత్యనారాయణ, అశోక్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.

Time For Producers Council Elections :

Producers Council Elections on June 30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs