‘ప్రెజర్ కుక్కర్’ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు
కరంపూరి క్రియేషన్స్ అండ్ మిక్ మూవీస్ పతాకంపై సాయి రొనాక్, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై మరియు సుశీల్ సంయుక్తంగా నిర్మించి, రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. A.అప్పిరెడ్డి మరో నిర్మాతగా వ్యవహరించారు. ఇద్దరు దర్శకులు, ముగ్గురు నిర్మాతలు రూపొందించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదమ్ములైన సుజై మరియు సుశీల్ యు.ఎస్. నుండి ఇండియాకు సినిమాలు చేయాలనే ప్యాషన్‌తో వచ్చారు. చాలా క్లారిటీతో క్లియర్‌గా సినిమాను రూపొందించారు. టిపికల్ ఫిలిమ్స్‌తో వస్తున్న ఇలాంటి కొత్త వారిని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. డిఫరెంట్ టైటిల్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ.. చిత్ర యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా అన్నారు.
దర్శక నిర్మాత సుజై మాట్లాడుతూ... పిల్లల్ని ఇంజినీరింగ్ చదించడం, తరువాత అమెరికా పంపించడం అక్కడ సెటిల్ అయ్యారని చెప్పుకోవడమే పరమావధిగా భావిస్తున్న మధ్యతరగతి తెలుగు కుటుంబాలపై విసిరిన వ్యంగ్యాస్త్రమే ఈ మా ‘ప్రెజర్ కుక్కర్’. కిషోర్ అనే కుర్రాడు ఏం చేసైనా సరే యు.ఎస్ వెళ్లాలనుకొని అతడు పడ్డ అష్టకష్టాలు, ఆ క్రమంలో కిషోర్ నేర్చుకున్న కొత్త పాఠాలు అతనిలో పెరిగిన ఆత్మవిశ్వాసం, కుటుంబం విలువల పట్ల కొత్తగా ఏర్పడ్డ గౌరవం.. దీంతో అసలు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా? అని అతనికి కలిగే సందేహం లాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించడం జరిగింది. చెప్పాలంటే సినిమా యూత్‌కు మెసేజ్ ఓరియెంటెడ్ లాంటిది. కథకు తగ్గట్లే ఈ చిత్రానికి సంగీతం కూడా చాలా బాగా కంపోజ్ చేశారు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్. అందుకు వారికి నా కృతఙ్ఞతలు. త్వరలో ఆడియోతో మీ ముందుకు వస్తాం. అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ... మహర్షి, ఫలక్ నుమాదాస్ లకు ప్లే బ్యాక్ సింగర్‌గా వర్క్ చేశాను. మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ కుదిరింది. అందరికీ నచ్చేలా ఉంటుంది. అని అన్నారు.
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ... సుజై ద్వారా నేను ఈ సినిమాలో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. మొట్ట మొదటిసారిగా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌తో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కరెంట్ యూత్‌కు ఇన్‌స్పిరేషన్‌లా ఉండే సినిమా. చాలా ఎంటర్‌టైనింగ్‌గా .. సెటైరికల్ గానూ ఉంటుంది. ఇక కొత్తవారిని ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే సురేష్ బాబుగారు మాకెంతో ఇన్‌స్పిరేషన్. ఆయన మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అని తెలిపారు.
హీరోయిన్ ప్రీతి మాట్లాడుతూ.. నా కల నెరవేరింది. పోస్టర్‌లో నన్ను నేను మొదటిసారిగా చూసుకున్నాను. ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. కో స్టార్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. అని అన్నారు.
హీరో సాయి రొనాక్ మాట్లాడుతూ.. నాకు అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్‌గారికి ధన్యవాదాలు. నేను రియల్ లైఫ్‌లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఈ సినిమా చూపించారు. చాలా మంచి సబ్జెక్ట్ అందుకు తగ్గట్టే మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉంటుంది. అని అన్నారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ... ఈ కాన్సెప్ట్‌పై రీసెర్చ్ చేసి రెండు సంవత్సరాలుగా కష్టపడి క్లారిటీతో స్టోరీని ప్రిపేర్ చేశారు. టెర్రిపిక్ ఔట్ ఫుట్ ఇచ్చారు టెక్నీషియన్స్. అందరికీ మంచి లైఫ్ ఉంటుంది ఆల్ ది బెస్ట్. అని అన్నారు.
సాయి రొనాక్, ప్రీతి అస్త్రాని, తనికెళ్ళ భరణి, సంగీత, రాహుల్ రామ కృష్ణ, రాజై రోవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి లిరిక్స్: సిరా శ్రీ, రాహుల్ సిప్లిగంజ్, ఆర్ట్: జె కె మూర్తి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్, మ్యూజిక్: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగుంజ్, సినిమాటోగ్రఫీ: నగేష్ బనెల్, అనిత్ మదాడి, ఎడిటర్: నరేష్ రెడ్డి జొన్న, నిర్మాతలు: సుజై, A. అప్పిరెడ్డి, సుశీల్, రచన- దర్శకత్వం : సుజై, సుశీల్.