ఓ అమ్మాయితో జీవితమంతా నిను వీడని తోడుగా నీడై నేను ఉంటానని అబ్బాయి చెబుతున్నాడంటే కచ్చితంగా ఆ అబ్బాయిది ప్రేమే. ఆ ప్రేమ భావాలకు ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన చక్కటి అక్షర రూపం ఇస్తే... శ్రోతలు మళ్ళీ మళ్ళీ వినేటటువంటి బాణీ స్వరపరిచారు ఎస్.ఎస్. థమన్. వినసొంపైన బాణీకి, చక్కటి పాటకు యాజిన్ నిజార్ గానం తోడవడంతో సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో చార్ట్‌బస్టర్‌గా నిలుస్తోంది. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. థమన్ సంగీత దర్శకుడు. ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన రాసిన ‘నిను వీడని నీడను నేనే’ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల చేశారు.
ఈ పాటకు అద్భుత స్పందన లభిస్తోంది. అలాగే, సాంగ్‌లో వచ్చిన కొన్ని సన్నివేశాలు హీరో హీరోయిన్ల మధ్య క్యూట్, రొమాంటిక్ లవ్‌ను చూపించాయి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగతా పాటల్ని విడుదల చేసి, జూలై 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాకరన్, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్, దర్శకుడు: కార్తీక్ రాజు.