Advertisement
Google Ads BL

టీజరే తట్టుకోలేకపోయింది.. నాగ్ పరిస్థితేంటో?


కింగ్ నాగార్జున ప్రస్తుతం మన్మథుడుకి సీక్వెల్ లో నటిస్తున్నాడు. మన్మథుడు 2 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున పెళ్లికాని బ్రహ్మచారి గా కనిపించనున్నాడు. చాలా ఏళ్ళు తరువాత తెరకెక్కుతున్న ఈసినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 9 న మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు నాగ్.

Advertisement
CJ Advs

రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈసినిమాలో సమంత అండ్ కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సరిగా వారం రోజులకి అంటే ఆగస్టు 15 న సాహో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ప్రభాస్ తో పోటీ కి వస్తున్నా నాగ్ ఇది పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే సాహో ఇండియా వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడంతో దీనిపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండేళ్లు తరువాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కాబట్టి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు.

ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉండే అవకాశముంది కావునా ఈ చిత్రం అటు వారం రోజులు.. ఇటు వారం రోజులు ఎవరు సినిమాలు రిలీజ్ చేయడానికి ముందుకు రారు. కానీ నాగ్ ఆ సాహసం చేస్తున్నాడు. ఆఖరికి నాగ్ తన చిత్రం మన్మథుడు 2 టీజర్ సాహో టీజర్‌తో పాటు రిలీజ్‌ చేయడంతో మన్మథుడు 2 టీజర్‌ ట్రెండింగ్‌లో లేకుండా పోయింది. ఇప్పుడు చిత్రం ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు. మరి ఏమవుతుందో చూద్దాం.

Nagarjuna vs Prabhas in August:

Manmadhudu 2 teaser Failed with Saaho Sensation 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs