Advertisement
Google Ads BL

కుటుంబ కథాచిత్రంలో నందమూరి హీరో!


ఈ ఏడాది నందమూరి కళ్యాణ్‌రామ్‌ 118 అనే చిత్రంతో డీసెంట్‌ హిట్‌ని నమోదు చేసుకున్నాడు. దీని తర్వాత ఆయన తుగ్లక్‌ అనే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తాడని వార్తలు వచ్చాయి. అంతలో శతమానం భవతి దర్శకుడు సతీష్‌ వేగేశ్నతో కలిసి ఈయన ముందుకు వెళ్లనున్నాడు. శతమానం భవతి చిత్రంతో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ఆ తర్వాత మరలా దిల్‌రాజుతోనే నితిన్‌ ప్రధాన పాత్రలో శ్రీనివాస కళ్యాణం చిత్రం చేశాడు. ఇది డిజాస్టర్‌ అయింది. దాంతో సతీష్‌, దిల్‌రాజుతో చేయాలనుకున్న ‘థాంక్యూ’ అనే ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఇంతలో సతీష్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌ చేత కథను ఓకే చేయించుకున్నాడు. 

Advertisement
CJ Advs

మరి ఇది ‘థాంక్యూ’ కథనా? లేక వేరే కథా? అనేది తెలియరాలేదు. ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌కి 17వ చిత్రంగా రూపొందనుంది. దీనికి శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పకులుగా వ్యవహరించనుండగా, ఆదిత్య మ్యూజిక్‌కి చెందిన ఉమేష్‌గుప్తా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రమని, కళ్యాణ్‌రామ్‌ ఇమేజ్‌కి తగ్గట్లు రాసుకున్న కథ అని తెలుస్తోంది. ఇందులో ఎమోషన్స్‌తో పాటు కళ్యాణ్‌రామ్‌ తరహా మాస్‌ ఇమేజ్‌ కూడా ఉంటుందిట. 

ఇప్పటిదాకా ఒక జోనర్‌గా కట్టుబడిన కళ్యాణ్‌రామ్‌ ఈ ఏడాది నుంచి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్దంగా ఉన్నాడు. ఇక సతీష్‌ వేగేశ్న సినిమాలంటే మరీ యాక్షన్‌, మాస్‌ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించి, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా రూపొందుతాయి. మరి సతీష్‌వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటించే చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచిచూడాల్సివుంది....! 

Nandamuri Hero in family oriented film:

Kalyan Ram New Movie Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs