Advertisement
Google Ads BL

ఆది పినిశెట్టి 'క్లాప్' కొట్టాడు!!


విభిన్నమైన పాత్రలను చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న  ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే "క్లాప్" చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో ఆది హీరోగా  నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తోంది. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య  దర్శకుడిగా  బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా "క్లాప్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా   ఈ చిత్రం జూన్ 12న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్, చంటి అడ్డాల, శ్రీమతి శోభారాణి, కొమర వెంకటేష్,  హీరోలు నాని, సందీప్ కిషన్, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, రచయిత చిన్నికృష్ణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా ఏస్ -ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తమిళ్ చిత్రానికిగాను హీరో నాని క్లాప్ నిచ్చారు. "క్లాప్" బౌండెడ్ స్క్రిప్టు ను ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ చిత్ర యూనిట్ కు అందించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్, దర్శకుడు పృథ్వీ  ఆదిత్య, నిర్మాతలు ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు, నటి క్రిష  కురుప్, డిఒపి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తాను అని చెప్పాను. అంతలా ఇంప్రెస్ అయ్యాను. వెరీ ఆర్ట్ టచ్చింగ్ మూవీ . డైరెక్టర్ చాలా టాలెంట్ వున్న వ్యక్తి. ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ఈ క్లాప్ చిత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ కన్విక్షన్ బాగా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. రెండు షేడ్స్ వున్నా పాత్రల్లో నటిస్తున్నాను. బాగా చెయ్యాలనే  తపనతో వున్నాను. నిర్మాత  కార్తికేయన్ నేను ఎప్పటినుండో సినిమా చెయ్యాలనుకుంటున్నాం. ఇన్నాళ్లకు కుదిరింది. ప్రతిభ వున్న నటీనటులు , టెక్నీషియన్స్  అందరూ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు.. అన్నారు. 

దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ.. ఇది వెరీ స్పెషల్ డే నాకు. వన్ ఇయర్ నుండి ఈ కథపై వర్క్ చేశాను. కార్తికేయన్ కి పాయింట్ చెప్పగానే నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకి వచ్చారు. వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయమన్నారు. ఆది కథ విని ఇమ్మీడియట్ గా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది.. అన్నారు. 

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది  నా మూడవ సినిమా. తమిళ్ లో ఫస్ట్ సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూర్స్ కి థాంక్స్ అన్నారు. 

సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ.. మిత్రుడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు కథ విని ఇంప్రెస్ అయి ఈ చిత్రంలో భాగమయ్యాను. బౌండెడ్ స్క్రిప్ట్ తో డైరెక్టర్ పృథ్వి పక్కా ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇళయరాజా గారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది. ఈ చిత్రంలోని క్యారెక్టర్ కి ఆది తప్ప ఇంకెవఋ అడాప్ట్ కారు. ఈ నెల 17నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబిస్తాం. హైదరాబాద్, చెన్నయ్, బెంగుళూరు, మధురైలలో  షూటింగ్ జరుపుతాం. మొత్తం నాలుగు షెడ్యూల్స్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం.. అన్నారు. 

Clap Movie Opening:

Aadhi Pinisetty Clap Movie Opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs