Advertisement
Google Ads BL

బాలయ్య దానికి ఒప్పుకుంటాడా?


బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10 న... తమ హీరో తమకి పండగలాంటి వార్త ఎమన్నా చెబుతాడేమో అని ఆయన ఫాన్స్ చాలా ఎదురు చూసారు. కానీ బాలకృష్ణ మాత్రం ఆచి తూచి తన సినిమాని అధికారికంగా నిన్న సాయంత్రం వరకు ప్రకటించలేదు. బోయపాటి తో బాలకృష్ణ కొత్త సినిమా ప్రకటన ఉంటుందని ఆశపడిన బాలయ్య ఫాన్స్ కి నిరాశే ఎదురైంది. అయితే బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ సినిమా రేపో మాపో పట్టాలెక్కుతోంది అనుకున్నప్పుడు.. ఆ సినిమా ఆగిపోయిందన్నారు. కానీ బాలయ్య పుట్టిన రోజు నాడు సాయంత్రానికి బాలయ్య - కె ఎస్ రవికుమార్ ల సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది. సి కళ్యాణ్ నిర్మాగా బాలయ్య కొత్త సినిమా ని కె ఎస్ రవికుమార్ దర్శకుడిగా మొదలు కాబోతుందని అధికారిక ప్రకటన వచ్చేసింది.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాలో మొదటి నుండి చెప్పుకున్నట్టుగా జగపతి బాబు విలన్ గా డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడట. అయితే బాలకృష్ణ ఎప్పుడూ మాస్ అండ్ పవర్ ఫుల్ టైటిల్ తోనే బరిలోకి దిగుతాడు. అందులో నరసింహనాయుడు, సమర సింహారెడ్డి, లెజెండ్, సింహ, జై సింహ లాంటి పవర్ ఫుల్ టైటిల్ నే బాలయ్య వాడేవాడు. కానీ తాజాగా కె ఎస్ రవికుమార్ - బాలయ్య చిత్రానికి ఓ సాఫ్ట్ టైటిల్ తెరమీదకి వచ్చింది. అదే క్రాంతి అనే టైటిల్. బాలకృష్ణ పేరునే టైటిల్ గా ఉండబోతుందని.. అందుకే క్రాంతి టైటిల్ కే మేకర్స్ మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. మరి క్రాంతిగా బాలయ్య తన నట విశ్వరూపాన్ని ఎలా చూపించబోతున్నాడో కానీ.. బాలయ్య ఫాన్స్ మాత్రం ఇలాంటి సాఫ్ట్ టైటిల్ బాలయ్యకి అచ్చిరాదని తెగ ఫీల్ అవుతున్నారు.

Balakrishna Film Title Kranthi:

KS Ravikumar would direct Balakrishna's 105th and it would be produced lavishly by C Kalyan. Sources reveal the film would be titled as Kranthi. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs