Advertisement
Google Ads BL

జూన్ 13 న ప్రభాస్ ఫాన్స్ కి పండగే!!


జూన్ 13న ప్రెస్టీజియస్ రెబెల్ స్టార్ ప్రభాస్  సాహో ట్రైలర్ విడుదల

Advertisement
CJ Advs

బాహుబలి 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ మేకింగ్ వీడియోస్ తో సంచలనం సృష్టించింది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో ట్రైలర్ ను జూన్ 13 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 కి ఇప్ప‌టికే ఇండియా మెత్తం క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌పంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. 

షేడ్స్ ఆఫ్ సాహో 2 తో ఈ చిత్రం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పెషల్ వీడియో లో  శ్రద్దా కపూర్ క్యారెక్టర్ లుక్ ని రివీల్ చేశారు. ఈ వీడియో లో ప్రభాస్, శ్రద్దా కపూర్ స్టైలిష్ లుక్స్... ఇంటర్నేషనల్ స్టాండర్ఫ్స్ మేకింగ్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్ లో తీస్తున్నారు అనేది మరింత స్పష్టమైంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్  దర్శకత్వం వహిస్తున్నాడు.  సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.  

Saaho trailer to be released on 13th of June:

Prabhas fans across the globe are eagerly waiting for this moment. Makers announced that they are going to release the trailer on 13th of June
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs