అక్కినేని నాగ చైతన్య తో పెళ్లి తరువాత సమంత తన ట్విట్టర్ హ్యాండిల్ పేరుని అక్కినేని సమంత గా మార్చుకుంది. ఇక లేటెస్ట్ గా ఆమె బేబీ అక్కినేని గా మార్చుకోవడంతో రకరకాల అర్థాలు తీస్తున్నాయి సోషల్ మీడియా వర్గాలు. త్వరలోనే సామ్ తల్లి కాబోతుందని అందుకే బేబీ అక్కినేని అని పెట్టుకుందని.. అంతా ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు రాసుకుంటున్నారు.
వాస్తవానికి సామ్ అలా పెట్టింది కేవలం తన కొత్త సినిమా అయిన ఓ బేబీ ని ప్రమోట్ చేసుకోవాలనే. కొరియన్ హిట్ మిస్ గ్రానీకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఓ బేబీ సినిమా చేస్తుంది సామ్. ఈసినిమా యొక్క ప్రమోషన్స్ లో భాగంగా అలా తన పేరుకు తగిలించుకుందే తప్ప అందులో అంతకు మించి అర్థం లేదు.
ఈ రూమర్ ఊరికే రాలేదు. గతంలో సామ్ నటించిన మజిలీ అప్పుడు శ్రావణి అనో లేదా రంగస్థలం టైంలో రామలక్ష్మి అనో లేదా యూటర్న్ గురించి ఇంకేదో ఇలా దేనికీ ట్విట్టర్ హ్యాండిల్ ని మార్చుకోలేదు సమంత. సో గతంలో ఆమె ఇలా అలా ప్రమోట్ చేసుకోలేదు కాబట్టి సామ్ తల్లికాబోతుందనే అనుకున్నారు. పిల్లలు గురించి సామ్ అప్పుడే ఏమి ఆలోచించట్లేదట. రెండు మూడేళ్లు ఫుల్ బిజీగా ఉండడంతో ఆమె తల్లికాబోతుందని వచ్చినవి రూమర్సే అని క్లారిటీ వచ్చేసింది.