Advertisement
Google Ads BL

భలే కాంబినేషన్ సెట్ చేశారు!


హఠాన్మరణం పొందిన మనసున్న మారాజు శ్రీహరి అంటే మీడియా వారికే కాదు..ఇండస్ట్రీలోని అందరికీ ఎంతో ఇష్టం. ఆయన హీరోగా నటించే సమయంలో ఎందరో ఫైటర్స్‌కి కడుపునిండా భోజనం దొరికేది. ఇక విషయానికి వస్తే శ్రీహరి-శాంతికుమారిల కుమారుడు మేఘాంశ్‌ హీరోగా పరిచయం అవుతూ రాజ్‌దూత్‌ చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తొలిటీజర్‌ బాగా ఆకట్టుకుంది. 

Advertisement
CJ Advs

మేఘాంశ్‌ని చూస్తే అచ్చు శ్రీహరిని చూస్తున్నట్లే ఉంది. మేఘాంశ్‌ తన తండ్రి శ్రీహరి పోలిక కాగా, శశాంక్‌ తన పోలిక అని శాంతి చెప్పుకొచ్చింది. మేఘాంశ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడని, శశాంత్‌ ప్రస్తుతం రచన, దర్శకత్వం వైపు ఆసక్తి చూపుతున్నాడని, అయితే త్వరలో శశాంక్‌ కూడా హీరోగా పరిచయం అవుతాడని వారి తల్లి చెప్పింది. ఇక రాజ్‌దూత్‌ మొదటి చిత్రం విడుదల కాకముందే మేఘాంశ్‌కి మరో రెండు ప్రాజెక్ట్‌లలో అవకాశం లభించింది. రాజ్‌దూత్‌ ని నిర్మిస్తున్న ఎం.ఎల్‌.వి.సత్యనారాయణ మేఘాంశ్‌తో మరో చిత్రం చేస్తానని ప్రకటించాడు. 

ఇక జీవిత, రాజశేఖర్‌లు కూడా దొరసాని ద్వారా పరిచయం అవుతున్న తమ చిన్న కూతురు శివాత్మికతో, మేఘాంశ్‌ని హీరోగా చూడాలని ఆశపడుతున్నారని, ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం ప్రారంభం కానుందని కన్‌ఫర్మ్‌ అయింది. మొత్తానికి నటునిగా, మానవతా వాదిగా పేరు తెచ్చుకున్న శ్రీహరి వారసుడు హీరోగా నిలబడాలని పరిశ్రమలోని అందరు ఆకాంక్షిస్తున్నారు. 

Sri Hari Son, Rajasekhar Daughter Combo Soon:

Real Star Son Loves With Angry Star Daughter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs