పెళ్లయిన తర్వాత సెలక్టివ్‌గా రోల్స్ ఒప్పుకుంటున్న అక్కినేని సమంత ఇటీవల ‘రంగస్థలం, సీమరాజా, అభిమన్యుడు, యూటర్న్’వంటి పలుచిత్రాలు చేసి విజయం సాధించింది. యూటర్న్ అనే కన్నడ రీమేక్‌ని అదే టైటిల్‌తో ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు పవన్ కుమార్‌తో చేసినా పెద్దగా కమర్షియల్ హిట్‌కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు పొందింది. కాగా ఇటీవల వచ్చిన మజిలీ చిత్రంలో ఈమె నాగచైతన్య సరసన పెళ్లి తర్వాత తొలిసారి నటించింది. ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో పాటు సమంత నటనకు ప్రశంసలు లభించాయి.
కాగా ప్రస్తుతం ఆమె సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో నందినిరెడ్డి దర్శకత్వంలో కొరియన్ ఫిల్మ్ మిస్ గ్రాసీకి రీమేక్‌గా ఓ బేబీ చిత్రంలో నటిస్తోంది. తన కెరీర్ పూర్తయ్యేలోపే ఇంత అల్లరి, కామెడీ ఉన్న పాత్రను చేయగలనా? అలాంటి అవకాశం తనకివస్తుందా? అని ఆలోచిస్తున్న సమంతకు ఓ బేబీ అదృష్టవశాత్తు లభించిందని ఆమె ఇటీవల చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రంలో కామెడీ ఎంటర్‌టైనర్‌తో పాటు గుండెలను పిండేసే ఎమోషన్స్ కూడా ఉన్నాయట.
దీని గురించి సమంత మాట్లాడుతూ, నా బాల్యం అమ్మమ్మ, నాయనమ్మ, తాత్తయ్య వంటి వారు లేకుండానే గడిచింది. దాంతో నందినిరెడ్డి మేడమ్ నన్ను ఓ వృద్దాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ, విని చలించిపోయాను. అయినా వారు అవ్వన్నీ మర్చిపోయి నవ్వుతూ సమయం గడుపుతున్నారు. ఆ ఎమోషన్స్‌ని నేను షూటింగ్‌లో క్యారీ చేశాను. ఇంకా వారి గురించిన ఆలోచనలు నా మదిని తొలుస్తూనే ఉన్నాయి. ఓ బేబీ మొదటి షోని వృద్దాశ్రమం వారితో కలిసి డిసైడ్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. సమంత, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది.