Advertisement
Google Ads BL

‘ఎన్జీకే’పై సూర్య ఏమన్నాడంటే..?


హీరో సూర్య కెరీర్‌ సినిమా సినిమాకి డౌన్‌ ఫాల్‌ అవుతోన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు సూర్య సరిగా కథలను ఎంచుకోలేకపోతున్నాడా? లేక తనకి తానుగా ఇదేదో కొత్తదనం ఉంది అనిపించి తనకి నచ్చిన వాటిని చేసేస్తున్నాడా? లేక ఇంతకు ముందు ప్రయోగాల పేరుతో దెబ్బతిన్నాను కాబట్టి వెరైటీ అని చెబుతూనే రొటీన్‌ మాస్‌ యాక్షన్‌ చిత్రాలు చేసి మరలా తన కెరీర్‌ మొదట్లో చూపిన సత్తా చూపాలని భావిస్తున్నాడా? అనే పలు అనుమానాలు రాకమానవు. 

Advertisement
CJ Advs

తాజాగా ఆయన సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌లతో కలిసి నటించిన ‘ఎన్జీకే’ చిత్రం విడుదలై డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అసలు ఈ చిత్రం చేసింది సూర్య వంటి విలక్షణ నటుడేనా అన్న అనుమానాలు కల్పించింది. ఈ చిత్రం గురించి సూర్య స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, ఎన్జీకే చిత్రంపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిప్రాయాలను నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. ఓ డిఫరెంట్‌ సినిమా అందించేందుకు చేసిన మా ప్రయత్నాన్ని, నటీనటుల కష్టాలను విశ్లేషించి, ప్రశంసంచిన అందరికీ కృతజ్ఞతలు. ఎన్జీకే తెరకెక్కించేందుకు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు.. అని తెలిపాడు. 

కాగా సూర్య ప్రస్తుతం రెండు నూతన చిత్రాలలో నటిస్తున్నాడు. కేవీఆనంద్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌, ఆర్యలతో కలిసి ‘కాప్పన్‌’, సుధాకొంగర దర్శకత్వంలో ‘సురారైపొట్రు’ చిత్రాలు చేస్తున్నాడు. మరి సూర్య మరోసారి పోటీలో నిలబడాలంటే ఈ రెండు చిత్రాలలో ఏదో ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైనా తేడా వచ్చిందా....? తెలుగు సరే.. తమిళంలో కూడా ఆయనకున్న క్రేజ్‌ అమాంతం పడిపోక తప్పదు. 

Suriya Reaction on NGK Result:

Suriya gets one more flop with NGK
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs