నిన్న గురువారం భారీ ప్రమోషన్స్ తో భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెవెన్ మూవీ, హిప్పీ మూవీలు తుస్ మన్నాయి. కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేక చతికిలపడ్డాయి. 7 సినిమా టీం అయితే తమ సినిమా తోపు, తురుము అంటూ బడాయిలు పోవడమే కాదు.. మీడియాకి రోజుకో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రమోషన్స్ ని హోరెత్తించారు. పోస్టర్స్, ట్రైలర్ తో తెగ హంగామా చేశారు. 7 సినిమా విడుదలై హిట్ అవుతుందని 7 టీం ఎంతగా నమ్మింది అంటే... రిలీజ్ కు ముందు సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకుండా అట్టేపెట్టేసారు. లిప్ లాక్స్, రొమాంటిక్ సన్నివేశాలతోనే సినిమాలు ఆడేస్తాయనుకుంటే ఎంత పొరబాటు అనేది 7 మూవీ టాక్ చెబుతుంది. సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే విడుదలకు ముందు రోజే 7 టీం ప్రీమియర్స్ తో హోరెత్తిస్తారు. ఇక ఈ సినిమాకి మొదటి షో మొదటి టాక్ కే బ్యాడ్ టాక్ వచ్చేసింది.
మరోపక్క RX 100 తో హీరో అవతారమెత్తిన కార్తికేయ ఎంతో కాన్ఫిడెంట్ తో చేసిన హిప్పీ సినిమా కూడా నిన్న గురువారమే విడుదలైంది. టి.ఎన్ కృష్ణ యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన హిప్పీ సినిమాకి కూడా బ్యాడ్ టాక్ వచ్చింది. కార్తికేయ మా సినిమా హిట్ .. RX 100 కి డబుల్ హిట్ కాదు పది రెట్ల హిట్ హిప్పీ సినిమాతో ఇస్తామని తెగ గొప్పలు పోయాడు. మా సినిమా హిట్ అంటూ తెగ ప్రమోట్ చేసిన హిప్పీ సినిమా చూసిన ప్రేక్షకుడికి తలకు బొప్పి కట్టింది. కార్తికేయ సిక్స్ పాక్స్ కోసమే సినిమా తీసారా అనిపించేలా పాటలోను, ఫైట్ లోను కార్తికేయ చొక్కా విప్పి కండలు చూపించే ప్రోగ్రాంతో చెలరేగిపోయాడు. అసలు ఈ సినిమా యూత్ మాట దేవుడెరుగు అసలెవరు చూసే దిక్కు దివాణం కనిపించడంలేదు. మరి విడుదలకు ముందు ప్రమోషన్స్ తో జోరు చూపించిన హిప్పీ మూవీ చూసిన వారు.. ఈ ప్లాప్ మూవీకా ఇంత బడాయిలు పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.