Advertisement
Google Ads BL

‘జ‌న‌సేన‌’ ఆశ‌యాల‌కు, ‘జై సేన’ ఆయ‌న భావాల‌కు!!


జ‌న‌సేన‌ పార్టీ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారి ఆశ‌యాల‌కు సంబంధించిన‌దైతే.. మా ‘జై సేన’ చిత్రం ఆయ‌న భావాల‌కు సంబంధించింది - ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర‌. 

Advertisement
CJ Advs

వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గురువారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను, మోషన్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు సునీల్‌ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. 

దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో శ్రీకాంత్‌, సునీల్‌తో పాటు నలుగురు కొత్త హీరోలను పరిచయం చేస్తున్నాను. షూటింగ్‌ పూర్తయ్యింది. ప్యాచ్‌ వర్క్‌ మిగిలి ఉంది. పదికాలాల పాటు నిలిచిపోయేలా మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ ఫిలింస్‌ బ్యానర్‌ను స్థాపించాం. ఇందులో తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. 

‘జై సేన’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సముద్ర మాట్లాడుతూ.. ‘‘పవన్‌కల్యాణ్‌ స్థాపించిన పార్టీ జనసేన ఆయన రాజకీయ ఆశయాలకు సంబంధించినది అయితే మా సినిమా ‘జై సేన’ ఆయన భావాలకు సంబంధించిన చిత్రం. అయితే ఆయన అభిమానంతో చేసే కొన్ని మంచి పనులను ఇందులో చూపిస్తున్నాం. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందులో కూడా సోషల్‌ కాజ్‌ ఉంటుంది. మాకు మా యూనిట్‌కు చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. రవిశంకర్‌ బ్రహ్మాండమైన పాటలను అందించారు. కో ప్రొడ్యూసర్‌ శిరీష్‌ రెడ్డిగారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందరూ మా బ్యానర్‌ను.. ఇందులో పరిచయం అవుతున్న హీరోలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

సునీల్‌ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాకు స్క్రిప్టే సూపర్‌స్టార్‌. నేను పరిచయం అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు మారకుండా అలాగే ఉండే వ్యక్తుల్లో సముద్రగారు ఒకరు. ఆయనకు నేను సహకరించాను అనడం కంటే ఆయనే నాకు సపోర్ట్‌ ఇచ్చారని చెప్పవచ్చు. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. ఇప్పటి వరకు కామెడి పాత్రలే ఎక్కువగా చేశాను. ఇందులో నాలోని వినోదంతోపాటు వైల్డ్‌ యాంగిల్‌ను కూడా చూస్తారు’’ అన్నారు. 

సంగీత దర్శకుడు రవిశంకర్‌ మాట్లాడుతూ - ‘‘ఇదొక పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీ. సముద్రగారితోనే నా జర్నీ స్టార్ట్‌ అయ్యింది. కచ్చితంగా సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు. 

శ్రీకార్తికేయ మాట్లాడుతూ - ‘‘సముద్రగారు ఓ సైనికుడిలా మమ్మల్ని ముందుకు నడిపించారు. సునీల్‌, శ్రీకాంత్‌గారు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. వారితో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది’’ అన్నారు. 

అభిరామ్‌ మాట్లాడుతూ - ‘‘సముద్రగారి సినిమాలో చైల్డ్‌ యాక్టర్‌గా నటించాను. ఆయన దర్శకత్వంలో హీరోగా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. 

ప్రవీణ్‌ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాలో హీరోగా నటించాలని చెప్పగానే భయమేసింది. ఈ సినిమా ద్వారా నాకు మంచి సోదరులు దొరికారు’’ అన్నారు. 

హరీష్‌ మాట్లాడుతూ - ‘‘సునీల్‌ అన్న మాకు ఎంతగానో సపోర్ట్‌ అందించారు. ఎన్నో సలహాలను అందించారు’’ అన్నారు. 

ఈ కార్యక్రమంలో శిరీష్‌ రెడ్డి, గోపీ తదితరులు పాల్గొన్నారు. 

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వి, ప్రవీణ్‌, కార్తికేయ, అభిరామ్‌, హరీష్‌ గౌతమ్‌, అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర. 

Jai Sena Title Poster Launch Event:

V Samudra Jai Sena Motion Poster Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs