Advertisement
Google Ads BL

మీటూలోకి విజయ్ దేవరకొండని లాగింది!


గత కొంతకాలంగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న అంశం ‘మీటూ’. అవకాశం ఇవ్వాలంటే మహిళా ఆర్టిస్టులు సెక్స్‌ సుఖం ఇవ్వాలనేది దారుణమని కొందరు దీనిపై తమ గళం విప్పుతున్నారు. ఇక విషయానికి వస్తే తాజాగా తమిళంలో శివకార్తికేయన్‌ హీరోగా ‘మిస్టర్‌ లోకల్‌’ నే చిత్రం విడుదలైంది. షాలు షమ్ము అనే క్యారెక్టర్‌ ఆర్టిస్టు పలు తమిళ చిత్రాలతో పాటు శివకార్తికేయన్‌ ‘మిస్టర్‌ లోకల్‌’లో కూడా నటించింది. ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ మీకు ఇండస్ట్రీలో మీటూ అనుభవం ఉందా? అని ప్రశ్నించాడు. దానికి ఆమె సమాధానం ఇస్తూ అవునని ఒప్పుకుంది. ఒక వేళ నేను ఫిర్యాదు చేసినా లాభం ఏమిటి? నిందితులు ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారా? ఈమధ్య ఓ ఫేమస్‌ డైరెక్టర్‌ ఓ రాత్రి తనతో గడిపితే విజయ్‌ దేవరకొండ చిత్రంలో హీరోయిన్‌గా చాన్స్‌ ఇప్పిస్తానని అన్నాడు అని చెప్పుకొచ్చింది. 

అయితే షాలు ఆ దర్శకుడు ఎవరో మాత్రం చెప్పలేదు. కానీ ఈ వివాదంలోకి అనవసరంగా విజయ్‌దేవరకొండ పేరు ప్రస్తావించడం వల్ల ఈ షాకింగ్‌ కామెంట్స్‌ బాగా వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఏ పిక్చర్‌లో నటించడానికి షాలుకి ఆ హామీ ఇచ్చారు? అనే విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. 

Heroine Metoo Allegations on Vijay Deverakonda next Movie Director:

Shammu Sensational Comments on Vijay Deverakonda next Film Director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs