Advertisement
Google Ads BL

మైత్రి మూవీ మేకర్స్‌ క్లారిటీ ఇచ్చేసింది..!


ప్రస్తుతం దక్షిణాదిలో మాంచి క్రేజ్‌ ఉన్న దర్శకులు అంటే అది రాజమౌళి, శంకర్‌, ప్రశాంత్‌ నీల్‌ అనే చెప్పాలి. ఒకే ఒక్క ‘కేజీఎఫ్‌ చాప్టర్‌1’ అతడిని రాత్రికిరాత్రి అంటే ఓవర్‌నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌ని చేసేసింది. ఆయనతో చిత్రాలు చేయాలని హీరోలు, నిర్మాతలు ఎగబడుతున్నారు. ఓ వారసత్వం లేని ఓ సాదాసీదా డ్రైవర్‌ కొడుకు యష్‌ని హీరోగా తీసుకుని ‘కేజీఎఫ్‌ చాప్టర్‌1’ తీస్తే ఏకంగా 350కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ చిత్రం బాలీవుడ్‌లోనేకాదు.. పాకిస్థాన్‌ వంటి దేశాలలో కూడా తన సత్తా చాటింది. నేడు ‘ప్రశాంత్‌నీల్‌’ అనేది ఒక బ్రాండ్‌ నేమ్‌గా మారింది. సరే అంటే కోట్లు అడ్వాన్స్‌ ఇవ్వడానికి నిర్మాతలు, కాల్షీట్స్‌ ఇవ్వడానికి అన్ని భాషల స్టార్స్‌ రెడీగా ఉన్నారు. మాకు ప్రశాంత్‌ నీలే కావాలని అగ్రనిర్మాతలు కలవరిస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దృష్టి మొత్తం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’ మీదనే ఉంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించి వేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. నీల్‌ అడిగిన వెంటనే సంజయ్‌దత్‌, రవీనాటాండన్‌లు ఇందులో నటించేందుకు అంగీకరించారు. తాజాగా ప్రశాంత్‌ నీల్‌ బర్త్‌డే సందర్భంగా పలు భాషలకు చెందిన అగ్రనిర్మాతలు, అభిమానులు ఆయన్ను ప్రశంసల వర్షంలో కురిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో సినిమా తీసేందుకు దిల్‌రాజు, అల్లుఅరవింద్‌, యువి క్రియేషన్స్‌ వంటి అగ్రనిర్మాణ సంస్థలే క్యూలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ పేరు ఎక్కువగా వినబడింది. ముందు ముందు టాలీవుడ్‌ అగ్రనిర్మాతలతో కలిసి ప్రశాంత్‌ నీల్‌ వరుస చిత్రాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీమేకర్స్‌ సంస్థ ఈ విషయంలో అడ్వాన్స్‌డ్‌గా ఉంది. 

ప్రశాంత్‌ నీల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే టు అవర్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌’ అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. సో... తెలుగులో ప్రశాంత్‌నీల్‌ చేయబోయే తొలి చిత్రం మైత్రి మూవీస్‌కే అన్న క్లారిటీ వచ్చింది. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, చరణ్‌, అల్లుఅరవింద్‌, మహేష్‌బాబు వంటి హీరోల అభిమానులందరు ప్రశాంత్‌ నీల్‌తో మైత్రి మూవీమేకర్స్‌ సంస్థ చిత్రం తమ హీరోతో ఉండాలని కోరుకుంటున్నారు. 

KGF Director Next Movie in Mythri Movie Makers :

Mythri Movie Makers birthday Wishes to KGF Director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs