మహేష్ ‘మహర్షి’ చిత్రంలో రైతుగా, ఎన్నారైగా, విద్యార్ధిగా విభిన్న గెటప్‌లతో కనిపించాడు. చిరు గడ్డం, మీసాలతో దర్శనమిచ్చాడు. ఇక ఆయన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’గా రూపొందనుంది. ఈ గ్యాప్‌లో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్స్‌కి వెళ్లాడు. అక్కడ తాము తీయించుకున్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. మహేష్ శ్రీమతి నమ్రతా కూడా ఓ ఫొటోని షేర్ చేసుకుంది. ఈ ఫొటోలో మహేష్, సితార, గౌతమ్‌లున్నారు.
ఇందులో మరలా మహేష్ తన ఓల్డ్ స్టైల్‌లోకి వచ్చేశాడు. క్లీన్‌షేవ్‌తో కనిపిస్తూ మరలా తన పూర్వపు స్టైల్‌కి రావడం అభిమానులకు ఆనందంగాఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ఇటీవల మే31న ప్రారంభం జరుపుకుంది. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ మొదలవుతుంది. మరి ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ కనుక అనిల్‌రావిపూడి.. మహేష్‌ని ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫొటోలలోని మహేష్‌ని చూస్తే కొత్త చిత్రంలో మహేష్ నార్మల్‌గా కనిపించనున్నాడని, ఎలాంటి మేకోవర్స్ లేవని అర్ధమవుతోంది.
ఈ ఫొటోలు ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో మహేష్ కింద స్టార్ డిజైన్ ఉంది. నెటిజన్లకు నమ్రతా దీని ద్వారా మహేష్ సూపర్‌స్టార్ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోందేమో అనిపించకమానదు. ఈ ఫొటోకు ‘నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులు. చాలాకూల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సెలబ్రేటింగ్ మహర్షి’ అని నమ్రతా క్యాప్షన్ ఇచ్చింది.